ఈ సినిమాలో అమితాబచ్చన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారని మొన్నటి వరకు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి ...
కొన్ని కాంబినేషన్స్ వినటానికి గమ్మత్తుగా ఉంటాయి. కానీ అవే భాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్స్ క్రియేట్ చేస్తూంటాయి. అందుకే దర్శక,నిర్మాతలు అలాంటివి సెట్ చేయటానికి ప్రయత్నిస్తూంటారు. తాజాగా రజనీకాంత్ జైలర్ సూపర్ హిట్ తో మంచి ఊపు మీద ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తదుపరి చిత్రానికి రంగం సిద్దమైంది. ఈ సినిమాకు తెలుగు టచ్ ఇవ్వబోతున్నారు. ఇక్కడ మార్కెట్ లోనూ బజ్ క్రియేట్ చేయటానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇక్కడ యంగ్ హీరోని రజనీకు విలన్ గా సెట్ చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే....
జైలర్ తరువాత జై భీమ్ దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రారంభం కావడానికి మరో రెండు నెలల టైమ్ పడుతుంది. ఈలోగా సినిమా గురించిన అప్డేట్స్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో అమితాబచ్చన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారని మొన్నటి వరకు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి శర్వానంద్ వచ్చి చేరారని సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ జ్ఞానవేల్ శర్వానంద్ కి కథ చెప్పాడని, స్టోరీ విన్నా, రజినీకాంత్ తో సినిమా కాబట్టి వెంటనే ఒకే చెప్పేసాడని సమాచారం.
అయితే ఈ సినిమాలో శర్వానంద్ విలన్ గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ న్యూస్ చిత్ర యూనిట్ నుండయితే అఫిషియల్ గా రాలేదు. అందువల్ల ఏది కూడా కంఫర్మ్ గా చెప్పలేము.అంతేకాకుండా ఈ పాత్ర ముందుగా నాని కి వచ్చిందని, అయితే విలన్ అయ్యేసరికి నాని రిజెక్ట్ చేసాడని, ఆ తర్వాతే శర్వానంద్ కి ఈ ఆఫర్ వెళ్లిందని టాక్ నడుస్తుంది. ఇందులో ఏది నిజమో చిత్ర టీమ్ క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రస్తుతం జైలర్ సూపర్ సక్సెస్ తో రజినీకాంత్ హిమాయలయాలకు వెళ్లారు. గత నాలుగేళ్లుగా హిమాలయాల యాత్ర కి గ్యాప్ ఇచ్చిన రజిని ఇప్పుడే అక్కడికి తన స్నేహితులతో గడుపుతున్నారు. ఆయన వచ్చిన తరవాతే జ్ఞానవేల్ సినిమా పట్టాలెక్కుతుంది.