
ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోల మధ్య మంచి అనుబంధం ఉంటుంది. ముఖ్యంగా మెగా అన్నదమ్ములు రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్ లు కలిసి మెలిసి ఉంటారు. సొంత అన్నాదమ్ముల మాదిరి ఉంటారు. రామ్ చరణ్ సలహాలు సూచనలు తీసుకుంటూ.. అన్నను గౌరవిస్తూ.. వరుణ్ తేజ్ ముందుకు వెళ్తుంటారు. ఇక మెగా ప్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి..మరీ స్టార్ హీరోల హోదాలో కాకపోయినా.. వరుణ్ తేజ్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పుడూ కమర్షియల్ సినిమాలే చేయకుండా విభిన్నమైన కథలను ఎంచుకోవడంతోపాటు సరికొత్త ప్రయోగాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు మెగా ప్రిన్స్. ఈమధ్యనే వరుణ్ తేజ్ చేసిన గని డిజాస్టర్ అయ్యింది. ఈసినిమా కోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డాడు. టోన్డ్ బాడీని డెవలప్ చేసుకున్నాడు. సినిమా పోయినా.. నిరాశపడుకుండా.. ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే 'గాండీవదారి అర్జున' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మెగా ప్రిన్స్. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈనెల 25వ తేదీన విడుదల కాబోతోంది. రిలీజ్ టైం దగ్గర పడటంతో మూవీ టీం ప్రమోషన్స్ ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ తేజ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ తన అన్న రామ్ చరణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. మంచి సినిమా ఇవ్వాలనే ప్రెజర్, జనాలను ఎంటర్టైన్ చేయాలని ప్రతి యాక్టర్ కి ఉంటుంది. నావరకు ఫ్యామిలీ ప్రెజర్ అనేది ఎక్కడా లేదు. ఒక యాక్టర్ గా అలాంటి సినిమాలు చేయొద్దు, ఇలాంటి సినిమాలు చేయొద్దు.. అని నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టరూ.. ఫలానా సినిమాలే చేయాలి అని నేను కూడా పరిమితం చేసుకోవడం కరెక్ట్ కాదని నమ్ముతాను. ఇప్పటివరకు అయితే నేను మంచి సినిమాలే తీశానని అనుకుంటున్నాను అన్నారు.
అంతే కాదు చేసిన సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా... ఇదే ఫార్ములాను నమ్ముతాను అన్నారు. ఇక మా అన్నయ్య చరణ్ కూడా నేను ఏడవ సినిమా చేస్తున్న సమయంలో నన్ను పిలిచి ఒక మాట చెప్పాడు. ఈ సమయంలో నీకు నచ్చిన సినిమా, నీకు కరెక్ట్ గా అనిపించిన సినిమా, నువ్వు నమ్మిన సినిమా నువ్వు చేసుకుంటూ ఉండు.. ఎవరి ప్రభావం నీ మీద ఉండకూడదు అని అన్నారు. అని వరుణ్ తేజ్ వెల్లడించాడు. అంతే కాదు ఇప్పుడు ఎలా ఉన్నా.. ఫ్యూచర్ లో నీకు బిజినెస్ తో పాటు మార్కెట్ పెరుగుతుంది. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ వస్తారు. కానీ ఎక్కడో చోట నిన్ను ఇలాంటి సినిమానే చేయాలని రిస్ట్రిక్ట్ చేస్తారు. కానీ నువ్వు మాత్రం అలాంటి ట్రాప్ లో పడొద్దు. అది ఫ్యూచర్ లో నీ కెరీర్ మీద ప్రభావం పడుతుంది. నువ్వు చేయాలి అన్న ఆశ ఉన్నా కొన్ని సినిమాలు అప్పుడు చేయలేవు అని సలహా ఇచ్చాడట రామ్ చరణ్.
అతే కాదు ఒకటైమ్ లో రామ్ చరణ్ కు కూడా ఇదే పరిస్థితి వచ్చింద. అప్పుడు చేసిన పొరపాటుకు ఇప్పుడు.. కొన్ని సినిమాలు చేయాలి అని ఉన్నా చేయలేని పరిస్థితి ఉందని అన్నాడట చరణ్. ఇలా ఫ్యామిలీలో ఎవరూ ఇప్పటి వరకూ చెప్పని విషయాలు తన అన్న తనతో చెప్పాడని వరుణ్ తేజ్ వెల్లడించాడు. ప్రస్తుతం రామ్ చరణ్ గురించి వరుణ్ తేజ్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.