అప్పుడే ఓటీటీలోకి రావణాసుర..? మాస్ మహారాజ్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Published : Apr 16, 2023, 10:57 AM IST
అప్పుడే ఓటీటీలోకి రావణాసుర..? మాస్ మహారాజ్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

సారాంశం

ఇలా రిలీజ్ అయ్యిందో లేదో.. అలా ఓటీటీలోకి వచ్చేస్తోంది మాస్ మహారాజ్ రవితేజ రావణాసుర సినిమా. మరి ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? 


వరుసగా హిట్లు కొడుతూ.. మంచి జోష్ మీద ఉన్న మాస్ మహారాజ్ రవితేజ జోరుకు బ్రేక్ లు వేసింది రావణాసుర సినిమా. చాలా కాలం వరుసగా ప్లాప్ లు ఫేస్ చేస్తూ.. కెరీర్ చాలా నిధానంగా సాగుతుంది అనుకున్నటైమ్ లో.. క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రవితేజ అప్పటి నుంచి దూకుడు చూపిస్తున్న రవితేజ.. వరుసగా సినిమాలను సెట్స్ ఎక్కిస్తూ వస్తున్నాడు. ఈక్రమంలో మాస్ మహారాజ్ కు మరో ప్లాప్ పడింది. 

రెండు బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో తిరిగి ఫామ్‌లోకి వచ్చేశాడనుకుంటే రవితేజకు రావాణాసుర భారీ షాక్ ను ఇచ్చింది. ఈరకంగా  మరో ఫ్లాప్‌ చేరింది. ఇప్పటికే దాదాదాపు ఈ సినిమా చాలా వరకు థియేటర్‌లలో నుంచి వెళ్లిపోయింది. అయితే ఫలితం ఎలా ఉన్నా రవితేజ నటన మాత్రం ఈ సినిమాలో అద్భుతమంటున్నారు ఫ్యానస్. హీరోనే అయినా..  నెగెటీవ్‌ క్యారెక్టర్‌లో కూడా మాస్ మహారాజ్ చించేశాడు. ఇక సుధీర్‌ వర్మ  అద్భుతమైన కథను రాసుకున్నా.. సినిమాను తెరకెక్కించే  పరంగా మాత్రం విఫలమయ్యాడు. 

ముఖ్యంగా  ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కించినా.. అలాంటి సినిమాలకు మెయింటేన్ చేయాల్సిన  సస్పెన్స్‌ మెయింటేన్‌ చేయలేక పోయారు. అంతే కాదు.. ఆడియన్స్ లో  క్యూరియాసిటీ కూడా క్రియేట్‌ చేయలేకపోమారు. దాంతో ఈ సినిమా విషయంలో డైరెక్టర్  సుధీర్‌ వర్మ ఫేయిలయ్యాడు. ఇక ఈక్రమంలో.. ఈమూవీ ఇక ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. 

ఈ సినిమా హక్కులను ప్రైమ్‌ వీడియో సంస్థ  దక్కించుకున్నాట్టు సమాచారం. దానికోసం దాదాపు 12 కోట్లు సదరు సంస్థ వెచ్చించినట్టు తెలుస్తోంది.   ఏప్రిల్‌ సెకండ్‌ వీక్‌ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది.  ఏమైనా.. ఎంత చిన్న సినిమా అయినా.. ఇంత త్వరగా ఓటీటీలో రిలీజ్ అయ్యిందే లేదు. కాని రావణాసుర ఇంత త్వరగా డిజిట్ ఫ్లాట్ ఫామ్ లోకి రావడం షాకింగ్ న్యూసే అవుతుంది. 

ఇక  యాక్షన్ థ్రిల్లర్‌ బ్యాక్ గ్రౌండ్ కథతో తెరకెక్కిన  ఈ సినిమాలో రవితేజ జోడీగా ఐదుగురు హీరోయిన్లు నటించారు.  అను ఇమాన్యూయేల్‌, మేఘా ఆకాశ్‌, ఫ‌రియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ మాస్ మహారాజ పక్కన సందడి చేశారు. ఇక  అక్కినేని సుశాంత్‌ కీలకపాత్ర పోషించగా... ఈ సినిమాను అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి ర‌వితేజ ఆర్‌టీ టీం వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించాడు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?