
హాట్ యాంకర్ అనసూయ ఏదున్నా మొఖం మీదే చెబుతుంది. పబ్లిక్ సర్వీస్‌కి సంబంధించి ఆమె ఏమాత్రం రాజీపడదు. తాజాగా ఓ ఎయిర్‌లైన్‌పై ఆమె ఫైర్ కావడం చర్చనీయాంశమైంది. ఇంతకి ఏం జరిగిందంటే.. అనసూయ రెండు రోజుల క్రితం రాజమండ్రి విమానాశ్రయానికి వెళ్లింది. అక్కడ ఇండిగో విమానం కోసం వెచి ఉంది. అయితే ఈ ఎయిర్‌లైన్ విషయంలో ఆమె అసంతృప్తి కి గురైందట. ఇండిగో ఎయిర్‌లైన్ సర్వీస్ పట్ల తను అసంతృప్తిని వ్యక్తం చేసింది. తాను అధికారికంగానే ఈ సర్వీస్‌ని అసహ్యించుకుంటున్నానని పోస్ట్ చేసింది.
`నేను ఇండియో ఎయిర్‌లైన్‌ని అధికారింగానే ద్వేషిస్తున్నా. ఇక్కడి దేశీయ విమానయాన సంస్థలను ఆధిక్యంలో ఉంచడం విచారకరం. సేవా ప్రమాణాలు ఇక్కడ చాలా స్టూపిడ్‌గా ఉన్నాయని పేర్కొంది అనసూయ. దీనికి ఎయిర్‌లైన్ నిర్వహకులు స్పందించారు. త్వరలోనే మిమ్మల్ని తిరిగి ఆన్ బోర్డ్ లో స్వాగతించే అవకాశం ఉంటుందని, భవిష్యత్‌లో మీకు మరింత మెరుగైన సేవలందించేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించారు.
`మేడమ్ మీరు రాజమండ్రి విమానాశ్రయంలో మా బృందాన్ని కలిసినందుకు ధన్యవాదాలు. సజావుగా, అవాంతరాలు లేని బోర్డింగ్ అనుభవాన్ని నిర్థారించడానికి సీక్వెన్షియల్ బోర్డింగ్ ప్రక్రియ అనుసరించబడుతుంది, మీకు కలిగిన అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం` అని ఇండిగో ఎయిర్‌లైన్ సంస్థ పేర్కొంది. అంతేకాదు ఆమెకి క్షమాపణలతో కూడిన ఓ సర్‌ప్రైజింగ్ ప్యాక్‌ని పంపించింది. ఇందులో తమ ఎయిర్‌లైన్‌లో ప్రయాణించినందుకు ధన్యవాదాలు చెబుతూ, హ్యాపీ జర్నీ అని పేర్కొంది. వారి సర్‌ప్రైజ్‌కి ఫిదా అయిన అనసూయ తానే తొందరపడ్డానని పేర్కొంది.
`సరే నేను నిన్న తొందరపడ్డాను. ఇది ఒక నిర్ధిష్ట నగరంలో ప్రాంతీయ సమస్య కవచ్చు, ఇదిగో నాకు ఇష్టమైన రాజమండ్రి విమానాశ్రయంలో జయంత్, రామ, ఇండిగో బృందం చేసిన స్వీట్ గెచ్చర్(మధురమైన సంజ్ఞ)కి ధన్యవాదాలు. మీ సిబ్బంది అందరు ఇంత ఆప్యాయంగా, స్వాగతించేలా ఉండాలని కోరుకుంటున్నా` అని పేర్కొంది. `తాను నిరాశని వ్యక్తం చేసినప్పుడు నా ఆనందాన్ని కూడా వ్యక్త పరచాలి. మీకు తెలిసిందే కాదా, అనసూయ ముక్కుసూటి మనిషి అని, ఏదున్నా ఎదురుగానే మాట్లాడుతుందని. ఓకే సీ యా` అంటూ పేర్కొంది అనసూయ. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇక అనసూయ ఇప్పుడు సినిమాలకే పరిమితమయ్యింది. యాంకరింగ్ వదిలేసింది. సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పించే ప్రయత్నం చేస్తుంది. ఆమె చేతిలో ప్రస్తుతం ఐదారు ప్రాజెక్ట్ లుండటం విశేషం. వాటిలో `పుష్ప2` మెయిన్‌గా ఉంది. ఇటీవలే `విమానం` అనే మరో సినిమాని ప్రకటించారు. ఇక టీవీ షోస్‌కి తాను దూరంగా ఉండాలనుకుంటున్నట్టు అనసూయ వెల్లడించిన విషయం తెలిసిందే. అక్కడ ఎదురయ్యే ట్రోల్స్, కామెంట్ల నుంచి దూరంగా ఉండేందుకు తాను టీవీ షోస్ మానేస్తున్నట్టు వెల్లడించింది. అంతకు ముందు ఆమె `జబర్దస్త్`కి యాంకర్‌గా ఉన్నారు.