Ramarao On Duty Teaser: క్రిమినల్స్ తాట తీస్తున్న రామారావు.. టీజర్ అదిరిపోయింది

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 01, 2022, 04:49 PM IST
Ramarao On Duty Teaser: క్రిమినల్స్ తాట తీస్తున్న రామారావు.. టీజర్ అదిరిపోయింది

సారాంశం

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మండవ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆర్ టి టీం వర్క్స్ బ్యానర్ లో రవితేజ, ఎస్ ఎల్ వి సినిమాస్ ఎల్ ఎల్ ఫై బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మండవ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆర్ టి టీం వర్క్స్ బ్యానర్ లో రవితేజ, ఎస్ ఎల్ వి సినిమాస్ ఎల్ ఎల్ ఫై బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రారంభం నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

నేడు మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. కొద్దిసేపటి క్రితమే విడుదలైన టీజర్ అదిరిపోయే విధంగా ఉంది. టీజర్ మొత్తం రవితేజ సీరియస్ గా, పవర్ ఫుల్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. ఆఫీస్ లో కూర్చుని సంతకాలు పెట్టడం మాత్రమే కాదు.. బయటకు వెళ్లి క్రిమినల్స్ తాట తీసే అధికారిగా రవితేజ కనిపిస్తున్నాడు. 

టీజర్ మొత్తం యాక్షన్ అంశాలతో కనిపిస్తోంది. రవి తేజ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. 'పేరు రూపం సింపుల్ గా ఉన్నా వాడో సూపర్ మాన్' అంటూ రవితేజ గురించి డైలాగ్ ఉంది. 'ఆయుధంలా బ్రతికే నాలాంటి వాడి ధైర్యం అణువణువునా ఉంటుంది' అంటూ రవితేజ విలన్ కి వార్నింగ్ ఇచ్చే డైలాగ్ అదిరిపోయింది. 

ఓవరాల్ గా రామారావు ఆన్ డ్యూటీ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉందని చెప్పొచ్చు. ఈ చిత్రంలో రవితేజకి జోడిగా మజిలీ ఫేమ్ దివ్యాంష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే జై భీం ఫేమ్ రాజిష కీలక పాత్రలో నటిస్తోంది. సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. 

 

PREV
click me!

Recommended Stories

రాశి ఖన్నా గ్లామరస్ పిక్స్ వైరల్, ఇంటెన్స్ లుక్స్ తో క్రేజీ ఫోజులు.. ఆమె ఆశలన్నీ డిప్యూటీ సీఎం పైనే
ఒక్క హీరోతో నటించడం వల్ల 9 మంది హీరోయిన్ల కెరీర్ నాశనం, ఇండస్ట్రీ నుంచి అవుట్.. ఆ హీరో ఎవరో తెలుసా ?