
ఇండియాలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్`(RRR Movie). ప్రస్తుతం ఇండియా మొత్తం ఈ చిత్రం కోసం వేచి చూస్తుంది. ఇద్దరు ఫ్రీడమ్స్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్ లైఫ్ బేస్డ్ గా రూపొందించిన సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పైగా ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్(Ram Charan) వంటి బిగ్ స్టార్స్ కలిసి నటిస్తుండటంతో ఆ హైప్ మరింత పెరిగింది. సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. మార్చి 25న రిలీజ్ కాబోతుంది.
తాజాగా ఈ సినిమా నుంచి చిన్న సర్‌ప్రైజ్ ఇచ్చారు రాజమౌళి(Rajamouli) టీమ్. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ చిత్రంలోని ఓ కొత్త ఫోటోని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. పచ్చని పార్క్ లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ రిలాక్స్ అవుతూ పడుకుని ఫోన్లు చూస్తున్న టైమ్‌లో తీసిన పిక్ ఇది. చాలా సహజంగా ఉంది. ఆకట్టుకుంటుంది. అయితే ఇందులో ఎన్టీఆర్, చరణ్ ఉన్న గెటప్ చూస్తుంటే, `నాటు నాటు`(Naatu Naatu Song) సాంగ్ చిత్రీకరణ సమయంలో దిగిన ఫోటో అని అర్థమవుతుంది. నాటు నాటు పాట షూటింగ్ గ్యాప్‌లో ఇలా ఈ ఇద్దరు స్టార్స్ సేదతీరుతున్నారు. అత్యంత సహజంగా ఉన్న ఈ ఫోటో ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇద్దరు చిల్ అవుతున్న సమయంలో అని చిత్ర యూనిట్ పేర్కొంది.
ఇదిలా ఉంటే ఈ పాట ఉక్రేయిన్‌లో చిత్రీకరించిన విషయం తెలిసిందే. బ్రిటీష్ రాజుల ముందు ఎన్టీఆర్, చరణ్ కలిసి డాన్సు చేసే సమయంలో నాటు నాటు సాంగ్ వస్తుంది. ఈ డాన్సు ఇప్పటికే దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. విదేశాల్లోనూ దీన్ని అనుకరిస్తూ డాన్సులు చేసిన వీడియోలు సంచలనంగా మారాయి. అంతగా ఈ పాట నెట్టింట దూసుకుపోతుంది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మిలియన్స్ వ్యూస్‌ని రాబట్టుకుంది. ఉక్రేయిన్ రాజధాని కీవ్‌లో ఈ పాట చిత్రీకరణ చేశారు. ఉక్రేయిన్ అందాలను ఇందులో బంధించారు. అయితే ఇప్పుడు ఉక్రేయిన్.. రష్యా చేస్తున్న దాడులకు నాశనమవుతున్న విషయం తెలిసిందే.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో కొమురంభీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరిగా చరణ్ కనిపించబోతున్నారు. అలియాభట్, బ్రిటీష్ నటి ఒలివీయో మోర్రీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా నాలుగు సార్లు వాయిదా అనంతరం ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది భాషల్లో విడుదల కాబోతుంది. ఆడియెన్స్ సైతం ఈ చిత్రం కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.