Bheemla Nayak:మనోభావాలను దెబ్బ తీశారంటూ 'భీమ్లా నాయక్' పై కేసు!!

Surya Prakash   | Asianet News
Published : Mar 01, 2022, 04:21 PM IST
Bheemla Nayak:మనోభావాలను దెబ్బ తీశారంటూ 'భీమ్లా నాయక్' పై కేసు!!

సారాంశం

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యిన విషయం తెలిసిందే. భారీగా కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమాపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతుంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.  పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా పవన్.. పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న మాజీ సైనికాధికారిగా రానా నటన నభూతో నభవిష్యత్తు లా ఉందని అభిమానులు అంటున్నారు. మాస్ ఫైట్స్, ఎలివేషన్స్ లో పవన్ ఒక రేంజ్ లో ఉన్నాయని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

 ముఖ్యంగా పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ లోని కొన్ని సీన్స్.. డేనియల్ శేఖర్ తండ్రి మరియు భార్యతో మాట్లాడే సీన్స్.. సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలలో రానా, పవన్ పోటీపడి చేసినట్లే కనిపిస్తారు.  తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్ సీస్ లోనూ ”భీమ్లా నాయక్” బీభత్సం కనిపిస్తోంది. ఈ నేఫద్యంలో ఈ చిత్రం కేసు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏమిటా విషయం అని చూస్తే...

గుంటూరుకు చెందిన శాలివాహన కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్ మండెపూడి పురుషోత్తం భీమ్లా నాయక్‌ సినిమా పై కేసు పెట్టారు. రానా కుమ్మరి చక్రాన్ని తన్ని పడగొట్టే సన్నివేశాన్ని మేకర్స్ తమ వర్గీయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చిత్రీకరించారని ఆ సన్నివేశాన్ని తొలగించి, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఫిర్యాదు చేశారు.

 ఈ విషయమై గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సినిమాలోని ఒక సన్నివేశంలో రానా కుమ్మరి చక్రాన్ని కాలితో తన్నడంతో.. మాకు అన్నం పెట్టే కుల చక్రాన్ని కాలితో తన్నడం బాధ అనిపించిందని, కుమ్మరి వారు అంటే అంత చులకన గా చూస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే ఆ సన్నివేశాలను సినిమా నుంచి తొలగించేలని , లేకపోతే తీవ్ర పరిణామాలు మేకర్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందని పురుషోత్తం డిమాండ్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు