
జయాపజయాలతో సంబంధంలేకుండా మాస్ మహారాజ్ రవితేజ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికీ ఆయన చేతిలో మూడు సినిమాలకు పైనే ఉన్నాయి. వరుసగా ఒకదాని వెంట మరొకటి సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. చాలా కాలం తర్వాత క్రాక్ తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన మాస్‌రాజ.. ఈ ఏడాది ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో బ్యాక్ టై బ్యాక్ ఫెయిల్యూర్స్ కూడా చూశాడు. ఇక ఈ సారి మాత్రం సాలిడ్ హిట్ కొట్టాలనిచూస్తున్నాడు సీనియర్ హీరో అందుకే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.
వరుసగా రెండు ఫ్లాపులు ఖాతాలో వేసుకున్నా.. రవితేజ మాత్రం హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. కుర్ర హీరోలను మించి స్పీడ్ చూపిస్తన్నాడు మాస్ మహారాజ్. ప్రస్తుతం రవితేజ నాలుగు సినిమాలను సెట్స్‌పై ఉన్నాయి. ఈ నాలుగు సినిమా షూటింగ్‌లు ఒకే విధంగా జరుగుతున్నాయి. అయితే ఇవి సెట్స్‌పైన ఉండగానే రవితేజ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
లక్ష్యం, లౌక్యం, డిక్టేటర్ లాంటి సినిమాలతో టాలీవుడ్ లో తన మార్క్ చూపించిన దర్శకుడు శ్రీవాస్‌తో రవితేజ తన నెక్ట్స్ సినిమా చేయనున్నట్లు టాలీవుడ్ లో న్యూస్ చకకర్లు కోడుతుంది. . ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు పూర్తయ్యాయని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కనుందట. త్వరలోనే దీనిపై అఫిషియల్‌గా అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తుంది.
ఇక ప్రస్తుతం శ్రీవాస్ గోపిచంద్‌తో ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇది అయిపోగానే రవితేజతో సినిమాస్టార్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రవితేజ టైగర్‌నాగేశ్వరరావు షూటింగ్ హడావిడిలో ఉన్నాడు. ఇండియన్ రాబిన్‌హుడ్‌గా పిలవబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. దీనితో పాటుగా త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమా చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.
ఇవి కాకుండ మాస్ మహారాజ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమా చేస్తున్నాడు ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రంలో రవితేజ నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. వీటీతో పాటుగా చిరంజీవితో కలిసి బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు అయిపోయిందంటున్నారు. ఇక వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న రవితేజ మంచి మనసు కూడా చాటుకుంటున్నాడు. రామారావ్ ఆన్ డ్యూటీ మూవీ ఫెయిల్యూర్ తో నష్టల్లో ఉన్న వారి కోసం.. తన రెమ్యూనరేషన్ ను తిరిగి ఇచ్చేశాడు సీనియర్ హీరో.