రాజకీయాలపై మరో కీలక ప్రకటన చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఏమన్నారంటే..?

Published : Aug 09, 2022, 10:39 AM ISTUpdated : Aug 09, 2022, 10:41 AM IST
రాజకీయాలపై మరో కీలక ప్రకటన చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఏమన్నారంటే..?

సారాంశం

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ మరోసారి రాజకీయాలవైపు చూస్తున్నారా..? అభిమానుల కోరక మేకరకు పాలిటిక్స్ లోకి ఎంటర్ కాబోతున్నారా..? ఈ మధ్య వినిపిస్తున్న మాటలివి. మరి ఈ విషయంలో తైలవా కామెంట్స్ ఏంటీ..?   

వెరీ రీసెంట్ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళనాడు గవర్నర్ కలవడం చర్చనీయాంశమైంది. సుమారు 30నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ఈ మీటింగ్ లో రాజకీయాలపై చర్చించినట్లు రజినీ మాట్లాడినప్పటికీ తాను ఆ విషయాలు మీడియాతో పంచుకోవడానికి సిద్ధంగా లేనని అన్నారు. అయితే రజనీ కాంత్ మళ్ళీ రాజకీయాల వైపు చూస్తున్నారా ..? అందుకే ఈ భేటీలా అంటూ తమిళ వర్గాల్లో చర్చ మొదలయ్యింది. 

 ఈ మీటింగ్ లో రాజకీయాలపై చర్చించినట్లు రజినీ మాట్లాడినప్పటికీ .. ఆ వీషయాలు చెప్పనన్నారు రజనీ కాంత్. తాను గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నానని అన్నారు. రీసెంట్ గా ఆజాదికా అమృత్ ఉత్సవాల కోసం కమిటీ మెంబర్ స్థాయిలో డిల్లీ వెళ్లి వచ్చారు రజనీ కాంత్ ముఖ్యమంత్రులు, ప్రతిపక్షనాయకులతో పాటు కళాకారులకు కూడా ఇందులో చోటు ఉండటంతో..తమిళనాడు నుంచి తలైవా ఇందులో మెంబర్ గా సెలక్ట్ అయ్యారు. 

ఇక అక్కడి నుంచి వచ్చిన తరువాత రాష్ట్ర గవర్నర్ ను కూడా కలవడం చర్చనీయాంశం అయ్యింది.  రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపినట్లు రజనీకాంత్ వివరించారు. తమిళనాడు, తమిళుల నిజాయతీ, కఠినశ్రమ, ఆధ్మాత్మిక భావజాలం గవర్నర్ ను ఆకర్షించాయని వెల్లడించారు. ఇక ఎప్పటి నుంచో అభిమానులు ఎదురుచూస్తున్న కీలకమైన రాజకీయాల్లో ఎంట్రీ గురించి రజనీకాంత్ మరో సారి క్లారిటీ ఇచ్చాడు. తనకు  అటువంటి ఆలోచన తనకు లేదంటూ కుండ బద్దలు కొట్టేశారు. 

2017లో రాజకీయాల్లోకి వచ్చేందుకు రజనీకాంత్ భారీ ఏర్పాట్లే చేశారు. కొన్నేళ్ల పాటు అదే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక పార్టీ ప్రకటిస్తారు అనుకున్న టైమ్ కు  సడెన్ గా 2020 డిసెంబరులో తన ఆలోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ టైమ్ గా బాగా అనారోగ్యానికి గురైయ్యారు రజనీకాంత్. వాటితో పాటు కొవిడ్ పరిస్థితులు, అనారోగ్య సమస్యల కారణంగా తాను రాజకీయాల్లోకి రావట్లేదంటూ సంచలన ప్రకటన చేశారు. ఇక అప్పటి నుంచీ సాధ్యమైనంత వరకూ సినిమాలు చేసుకుంటూ.. రాజకీయాలకు దూరంగా గడుపుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Janhvi Kapoor: బ్యాక్‌లెస్ డ్రెస్‌లో జాన్వీ ఆరాచకం.. చెవిపోగుల ధర తెలిస్తే ఫ్యూజులు ఔట్‌
Ram Charan Review: డెకాయిట్‌ మూవీకి రామ్‌ చరణ్‌ రివ్యూ.. అంత బాగానే ఉంది, అసలు విషయం వదిలేశాడు