Bimbisara Collections: బింబిసార వరల్డ్ వైడ్ కలెక్షన్స్... సోమవారం పరిస్థితి ఏంటి!

Published : Aug 09, 2022, 11:07 AM IST
Bimbisara Collections: బింబిసార వరల్డ్ వైడ్ కలెక్షన్స్... సోమవారం పరిస్థితి ఏంటి!

సారాంశం

బింబిసార విజయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ మారింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో దక్కిన విజయం కావడంతో అందరూ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక వీకెండ్ ఘనంగా ముగించిన బింబిసార వర్కింగ్ డే సోమవారం కూడా సత్తా చాటింది. 

వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న కళ్యాణ్ రామ్(Kalyan Ram) సాలిడ్ హిట్ అందుకున్నారు. డెబ్యూ డైరెక్టర్ వశిష్ట్ ఓ అద్భుతమైన కథను ఇంకా అద్భుతంగా తెరకెక్కించిన సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. వరల్డ్ వైడ్ రూ. 16.5 కోట్ల వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ వీకెండ్ ముగిసే నాటికి టార్గెట్ దాటేసింది. ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో బింబిసార మూడు రోజులకు గాను రూ. 15.8 కోట్ల షేర్ వసూలు చేసింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో రికార్డు వసూళ్లు బింబిసార వసూలు చేసింది. 

నాలుగవరోజు మండే టెస్ట్ కూడా బింబిసార(Bimbisara Collections) విజయవంతంగా పూర్తి చేసింది. 4వ రోజు బింబిసార రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.27 షేర్ వసూళ్లు సాధించింది. అలాగే నాలుగు రోజులకు గాను ఓవర్సీస్ లో రూ.1.52, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 1.23 కోట్లు దక్కాయి. మొత్తంగా బింబిసార నాలుగు రోజులకు ఏపీ/తెలంగాణాలలో రూ. 18.10 కోట్లు వరల్డ్ వైడ్ రూ. 20.85 షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి. అంటే ఇప్పటికే బయ్యర్లు మంచి లాభాలు బింబిసార ద్వారా ఆర్జిస్తున్నారు. రూ. 4.65 లాభాలు సోమవారానికి నమోదయ్యాయి.  

వరుస ప్లాప్స్ తో డీలా పడ్డ డిస్ట్రిబ్యూటర్స్ కి బింబిసార విజయం ఉపశమనం కలిగించనుంది. కళ్యాణ్ రామ్ రెండు భిన్నమైన గెటప్స్ లో ఆకట్టుకున్నారు. ఇక బింబిసారకు సీక్వెల్ ఉంటుందని కళ్యాణ్ రామ్ ప్రకటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ స్వయంగా ఈ మూవీ నిర్మించారు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందించారు. 
 

PREV
click me!

Recommended Stories

Kalyan Padala తో వర్కౌట్‌ కాకపోవడంతో డీమాన్‌ పవన్‌ని పట్టుకుంది.. ట్రోల్స్ పై రీతూ చౌదరీ రియాక్షన్‌ ఇదే
BBK 12 Finale: బిగ్ బాస్ ప్రకటించకముందే విన్నర్ పేరు లీక్ చేసిన వికీపీడియా.. విజేత ఎవరో తెలుసా?