మాస్‌ మహారాజా, నేచురల్‌ స్టార్‌ కలిసి మల్టీస్టారర్‌.. నిర్మాతలు ఎవరో తెలుసా?

Published : Mar 26, 2023, 05:41 PM IST
మాస్‌ మహారాజా, నేచురల్‌ స్టార్‌ కలిసి మల్టీస్టారర్‌.. నిర్మాతలు ఎవరో తెలుసా?

సారాంశం

రవితేజ, నాని కలిసి  తమ కష్టాలను పంచుకున్నారు. హీరోలుగా కాకముందు తమ లైఫ్‌ ఎలా ఉండేదో తెలిపారు. హీరోగా మారిన ప్రారంభంలో ఎలా ఉండేదో వివరించారు. కష్టాలు, సుఖాలు షేర్‌ చేసుకున్నారు.

మాస్‌ మహారాజా రవితేజ, నేచురల్‌ స్టార్‌ నాని.. ఇద్దరూ ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు స్టార్‌ హీరోలుగా రాణిస్తున్నారు. వీరిద్దరి సినిమాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ విడుదల కాబోతున్నాయి. మార్చి 30న శ్రీరామనవమి కానుకగా నాని `దసరా` రిలీజ్‌ కానుండగా, ఆ వచ్చే వారం ఏప్రిల్‌ 7న రవితేజ నటించిన `రావణాసుర` రిలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు. ఈ ఇద్దరు కలిసి ప్రమోషన్స్ చేశారు. ఒకరినొకరు ఇంటర్వ్యూలు చేస్తూ అలరించారు. ప్రస్తుతం వీరి ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇందులో తమ కష్టాలను పంచుకున్నారు నాని, రవితేజ. హీరోలుగా కాకముందు తమ లైఫ్‌ ఎలా ఉండేదో తెలిపారు. హీరోగా మారిన ప్రారంభంలో ఎలా ఉండేదో వివరించారు. కష్టాలు, సుఖాలు షేర్‌ చేసుకున్నారు. బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చిన ఈ ఇద్దరు తమ జర్నీని గుర్తు చేసుకుని ఒకరినొకరు అభినందించుకున్నారు. అంతేకాదు ఇందులో ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. మాటల్లో భాగంగా ఇద్దరం కలిసి సినిమా చేయాలని అనుకున్నారు. 

రవితేజ, నాని కలిసి హీరోలుగా ఓ మల్టీస్టారర్‌ చేయాలనే ఆలోచనకు వచ్చారు. కలిసి సినిమా చేద్దామనుకున్నారు. అయితే ఆ సినిమాని తామే నిర్మించుకుద్దామని కూడా అనుకున్నారు. నాని ఇప్పటికే నిర్మాతగా మారారు. `వాల్‌ పోస్టర్‌ సినిమా`పై సినిమాలు నిర్మిస్తున్నారు. `ఆ`, `హిట్‌` చిత్రాలను నిర్మించారు. మరోవైపు రవితేజ కూడా నిర్మాతగా మారారు. `రావణాసుర` చిత్రంతో ఆయన నిర్మాణంలోకి అడుగుపెట్టారు. అందుకు `ఆర్‌టీ` పేరుతో ప్రొడక్షన్‌ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రవితేజ, నాని కలిసి నటించాలనుకున్న చిత్రాన్ని వీరిద్దరే తమ నిర్మాణ సంస్థలపై నిర్మించుకోవాలనుకోవడం విశేషం. `ఆ ఛాన్స్ ఎవరికీ ఇవ్వద్దు. మనమే చేద్దాం` అని అనుకున్నారు ఈ ఇద్దరు హీరోలు. ప్రస్తుతం వీరి కామెంట్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఇద్దరి అభిమానులను ఖుషి చేస్తుంది. 

నిజానికి రవితేజ, నాని ఇంటర్వ్యూతో ఓ కొత్త ఒరవడి సృష్టించారు. ఇప్పుడు మరో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. ఇద్దరు కలిసి సినిమాలు చేయాలనుకోవడం హీరోల మధ్య ఉన్న అనుబంధాన్ని, తెలుగు హీరోల మధ్య ఉన్న ఆరోగ్యకరమైన రిలేషన్‌ని చాటి చెబుతుంది. ఇది ఇతర హీరోలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు ఇలాంటి కంబైన్డ్ ప్రమోషన్స్ సైతం తమ సినిమాలకు హెల్ప్ కావడంతోపాటు ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం క్రియేట్‌ కావడానికి దోహద పడుతుంది. ఇలా చేయడం వల్ల ఒక హీరో సినిమాని మరో హీరో అభిమానులు ఎంకరేజ్‌ చేస్తారు, ఆదరిస్తారు. ఇది సినిమా సక్సెస్‌కి కలిసొస్తుందని చెప్పొచ్చు. మరి రవితేజ, నాని కలిసి నిజంగానే సినిమా చేస్తారా? లేదో తెలియదుగానీ, వీరి ఇంటర్వ్యూ మాత్రం ఆదర్శంగా నిలుస్తుండటం విశేషం. 

రవితేజ హీరోగా నటించిన `రావణాసుర` చిత్రంలో సుశాంత్‌ విలన్‌గా నటిస్తుండగా, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధీర్‌వర్మ దర్శకత్వం వహించారు. అభిషేక్‌ పిక్చర్స్, ఆర్‌టీ పతాకాలపై అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. మరోవైపు నాని, కీర్తిసురేష్‌ జంటగా నటించిన `దసరా` చిత్రానికి శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వం వహించారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

100 సినిమాల్లో 44 ప్లాప్ లు, 30 మూవీస్ రిలీజ్ అవ్వలేదు, అయినా సరే ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?