చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన యువనటి హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పాపులర్ భోజ్ పురి యాక్ట్రెస్ ఆకాంక్ష దుబే (Akankha Dubey) ఆత్మహత్య చేసుకుంది. దీంతో భోజ్ పురి ఇండస్ట్రీలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. 25 ఏండ్ల వయస్సులోనే ప్రాణాలను తీసుకోవడం అందరినీ బాధిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఈ ఘటన జరిగింది. నిన్ననే కన్నడ డైరెక్టర్ కిరణ్ గోవి గుండెపోటుతో మరణించడం.. ఆ ముందు రోజు బాలీవుడ్ డైరెక్టర్ దాదా కన్నుమూశారు. తాజాగా యువనటి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.
వివరాల్లోకి వెళితే.. ఈరోజు ఉదయం ఆకాంక్ష దుబే వారణాసిలోని ఓహోటల్ ఆత్మహత్య చేసుకుంది. శరనాథ్ హోటల్ రూమ్ లో ఉరేసుకొని సూసైడ్ కు పాల్పడింది. ఈరోజు 9 గంటలకు తన మేకప్ మ్యాన్ హోటల్ రూమ్ కు రావడంతో ఆకాంక్ష డెడ్ బాడీ కనిపించింది. దాంతో విషయం తెలుసుకున్నపోలీసులు డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆష్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమెది ఆత్మహత్యానా? లేదా హత్యనా? అన్నది తేలే అవకాశం ఉందంటున్నారు.
అయితే, ఆకాంక్ష సింగ్ ఆత్మహత్యకు కొన్ని గంటల ముందే తన ఇన్ స్టాగ్రామ్ లో పవన్ సింగ్ తో కలిసి చేసిన కొన్ని మ్యూజిక్ వీడియోలను షేర్ చేసింది. ఆ తర్వాత సూసైడ్ చేసుకుంది. మార్నింగ్ నుంచే బాయ్ ఫ్రెండ్ సమర్ సింగ్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ లోనే ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
1997 అక్టోబర్ 21న ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో జన్మించింది నటి ఆకాంక్ష దుబే. ప్రస్తుతం బోజ్ పురి ఇండస్ట్రీలో ఈ యువ నటి అవకాశాలను అందుకుంటూ వస్తోంది. ఇక రీసెంట్ గా వాలెంటైన్స్ డే సందర్భంగా ఆకాంక్ష తన రిలేషన్ షిప్ ను కూడా ప్రకటించింది. తన కోస్టార్ సమర్ సింగ్ కు నసంబంధించిన ఫొటోలను పంచుకుంటూ పోస్టులు పెట్టింది.
ఆకాంక్ష దుబే రీసెంట్ గా ‘మిట్టి’ అనే చిత్ర షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ‘నాయక్’ అనే చిత్రంలో నటించబోతోంది. గతంలో ముజ్సే షఆదీ కరోగి, వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్, కసమ్ పైడా కర్నే కేఐ 2 లాంటి చిత్రాల్లో నటించింది. తన 17వ ఏటనే మేరీ జంగ్ మేరా ఫ్లైస్లా అనే చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెటెట్టింది.