ఫ్లాఫ్ వస్తే రేటు తగ్గంచటానికి హీరోలు ఒప్పుకోరు కానీ హిట్ వస్తే మాత్రం ఒక్క రోజు కూడా తన రెమ్యునేషన్ పెంచటానికి వెనకాడరు. ఇప్పుడు రవితేజ కూడా అదే స్కీమ్ ని ఫాలో అవుతున్నట్లు సమాచారం. చాలా కాలం గ్యాప్ తర్వాత సాలిడ్ హిట్ కొట్టాడు. రవితేజ, శృతిహాసన్ కాంబోలో రెండోసారి వచ్చిన క్రాక్ చిత్రం సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు చల్లబడ్డా క్రాక్ మాత్రం ఎక్కడా డౌన్ ఫాల్ కనపడటం లేదు. ఈ నేపధ్యంలో రవితేజ తన రెమ్యునేషన్ ని అమాంతం పెంచేసాడని సినీ వర్గాల సమాచారం.
ఇన్నాళ్లూ రవితేజ బ్యానర్ ని బట్టి పది నుంచి 12 కోట్లు దాకా డిమాండ్ చేసి రెమ్యునేషన్ తీసుకునే వారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని 14 కోట్లకు పెంచేసారు. జీఎస్టీ అదనం. దాంతో మొత్తం రవితేజకు ఇచ్చేదే 16 కోట్లు దాకా ఉండబోతోంది. తన సినిమాల నాన్ థియోటర్ రెవిన్యూనే 26 నుంచి 28 కోట్లు దాకా ఉంటోంది. అలాంటప్పుడు తను పెంచటంతో తప్పేముందని రవితేజ వాదన. థియేటర్ రెవిన్యూ సైతం 25 కోట్లు దాకా ఉంటోంది. మొత్తం 50 కోట్లు బిజినెస్ తన సినిమాతో జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా నిర్మాతకు రెమ్యునేషన్ బర్డెన్ కాదు.
ఇక క్రాక్ తర్వాత రమేష్ వర్మ తో రవితేజ చేస్తున్న ఖిలాడీ సినిమాకి ఏకంగా 13 కోట్ల రెమ్యునేషన్ అది సింగల్ పేమెంట్ లో నిర్మాతలు సెటిల్ చేశారని సమాచారం. ఈ నేపధ్యంలో క్రాక్ హిట్ తో రవితేజ రెమ్యునరేషన్ భారీగా పెరిగిపోయింది. డిజాస్టర్స్ ఉన్నప్పుడే రవితేజ రెమ్యునేషన్ విషయంలో ముక్కుపిండి వసూలు చేసేవారు. ఇప్పుడు మంచి హిట్ పడ్డాక ఊరుకుంటాడా..అంటున్నారు ఆయన గురించి తెలిసిన వాళ్ళు.
ఇక త్రినాధరావు నక్కిన తో రవితేజ ఖిలాడీ తర్వాత చెయ్యబోయే సినిమాకి ఏకంగా 15 కోట్ల రెమ్యునేషన్ అందుకోబోతున్నాడని చెప్తున్నారు. రెండు వారాల్లోనే లాభాల బాట పట్టించిన క్రాక్ సినిమాకి రవితేజకి 12 కోట్ల వరకు పారితోషకం వరకు ముట్టింది.
మరో విషయం..మాస్ రాజా తను అందుకున్న తొలి పారితోషికం ఎంతో తెలుసా.. నిన్నే పెళ్లాడతా సమయంలో నాగార్జున చేతుల మీదుగా ఈయన తొలి రెమ్యునరేషన్ తీసుకున్నాడు. 3500 రూపాయలతో నాగ్ సంతకం పెట్టిన చెక్ తనకు ఇచ్చారని.. దాన్ని చాలా రోజుల వరకు దాచుకున్నానని చెప్పాడు రవితేజ. ఆ తర్వాత కొన్ని రోజులకు డబ్బులు అవసరం పడి బ్యాంకులో వేసుకున్నానని చెప్పాడు మాస్ రాజా.