సల్మాన్ తో క్రాక్ రీమేక్ చేస్తా - గోపి చంద్ మలినేని

By team teluguFirst Published Jan 26, 2021, 10:22 PM IST
Highlights

క్రాక్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న గోపీచంద్ మలినేని ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అవకాశం వస్తే ఇతర భాషల్లో క్రాక్ చిత్రాన్ని రీమేక్ చేస్తానని ఆయన అన్నారు. ముఖ్యంగా హిందీలో క్రాక్ రీమేక్ చేసే ఆలోచన ఉందని గోపీచంద్ మనసులో మాట బయటపెట్టారు. 

దర్శకుడు గోపి చంద్ మలినేని ఒక్కసారిగా టాలీవుడ్ ఫేవరేట్స్ దర్శకులలో ఒకరిగా మారిపోయారు. క్రాక్ మూవీ విజయం ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది. బలుపు మూవీ తరువాత రెండు వరుస పరాజయాలు అందుకున్న గోపి చంద్, క్రాక్ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. క్రాక్ రవితేజను కూడా పరాజయాల నుండి బయటపడేసింది.  మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న క్రాక్ రికార్డు వసూళ్లు రాబడుతుంది. 

క్రాక్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న గోపీచంద్ మలినేని ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అవకాశం వస్తే ఇతర భాషల్లో క్రాక్ చిత్రాన్ని రీమేక్ చేస్తానని ఆయన అన్నారు. ముఖ్యంగా హిందీలో క్రాక్ రీమేక్ చేసే ఆలోచన ఉందని గోపీచంద్ మనసులో మాట బయటపెట్టారు. అన్ని భాషలకు సరిపోయే ఈ కథ సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్ గణ్,  అక్షయ్ వంటి హీరోలు అంగీకరిస్తే చేస్తాను అన్నారు.  
క్రాక్ మూవీతో రవితేజ- గోపీచంద్ హ్యాట్రిక్ హిట్ కొట్టడం జరిగింది. 

శృతి హసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సముద్ర ఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక రోల్స్ చేశారు. ఇక థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కాగా జనవరి 29నుండి క్రాక్ ఆహా లో స్ట్రీమ్ కానుంది. అల్లు అరవింద్ ఫ్యాన్సీ ప్రైస్ చెల్లించి క్రాక్ డిజిటల్ రైట్స్ దక్కించుకున్నాడని సమాచారం. 

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated Jan 26, 2021, 10:22 PM IST