చిరు అసహనంతో.. సార్ అంటూ దిగొచ్చిన కొరటాల!

Published : Jan 26, 2021, 09:58 PM ISTUpdated : Jan 26, 2021, 09:59 PM IST
చిరు అసహనంతో.. సార్ అంటూ దిగొచ్చిన కొరటాల!

సారాంశం

రామ్ చరణ్ ఆచార్య మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఇటీవలే ఆయన షూటింగ్ లో పాల్గొనడం జరిగింది.  కాగా ఈ మూవీ టీజర్ విషయంలో చిరంజీవి దర్శకుడు కొరటాల శివపై అసహనం వ్యక్తం చేశారు.

మొదటిసారి మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నాడు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. ఆచార్య పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. పురాతన దేవాలయాలకు సంబంధించిన సెట్స్ లో ఆచార్య షూటింగ్ నిర్వహిస్తున్నారు. రామ్ చరణ్ ఆచార్య మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఇటీవలే ఆయన షూటింగ్ లో పాల్గొనడం జరిగింది.  కాగా ఈ మూవీ టీజర్ విషయంలో చిరంజీవి దర్శకుడు కొరటాల శివపై అసహనం వ్యక్తం చేశారు. 

ఏమయ్యా కొరటాల శివ... న్యూ ఇయర్ కి లేదు, సంక్రాంతికి లేదు , ఇంకెప్పుడయ్యా టీజర్ అని అడుగగా.. కొరటాల అదే పనిలో ఉన్నా సార్ అంటూ సమాధానం చెప్పాడు. నువ్వు చెప్పకపోతే నేనే లీక్ చేసేస్తా.. అంటూ చిరు చిన్న ఝలక్ ఇచ్చాడు. రేపు మార్నింగ్ 10:00 గంటలకు ఆచార్య టీజర్ పై అప్డేట్ ఇస్తానంటూ కొరటాల చిరంజీవికి హామీ ఇచ్చారు. ఐతే చిరంజీవి అసహనం, కొరటాల బిడియం ప్రొమోషన్ కోసమే. ఆచార్య టీజర్ పై అప్డేట్ గురించి ఓ ఫన్నీ సంబాషణతో కూడిన పోస్ట్ చేశారు చిరంజీవి. 

రేపు ఉదయం ఆచార్య టీజర్ పై కొరటాల అప్డేట్ ఇవ్వనున్నాడు.  ఇక కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సోనూ సూద్ ఓ కీలక రోల్ చేస్తున్నారు. దర్శకుడు మణిశర్మ ఆచార్య చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఆచార్య విడుదల కానుందని సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆచార్య మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?