గ్యాంగ్ స్టర్ నయీమ్ కు కూడా భరత్ లాంటి హీనమైన పరిస్థితి రాలేదు

Published : Jun 26, 2017, 07:09 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
గ్యాంగ్ స్టర్ నయీమ్ కు కూడా భరత్ లాంటి హీనమైన పరిస్థితి రాలేదు

సారాంశం

రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైైన రవితేజ సోదరుడు భరత్ రాజు చనిపోయిన రెండో రోజే షూటింగ్ లో పాల్గొన్న రవితేజ ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లకుండా స్మశానానికే భరత్ పార్థివ దేహం భరత్ చనిపోయిన రెండో రోజే షూటింగ్ లో పాల్గొన్న రవితేజ

తెలుగు హీరో రవితేజ సోదరుడు భరత్ ఔటర్ రింగురోడ్డులో ఆగివున్న లారీని కారుతో ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. భరత్ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అందరినీ విస్మయానికి గురి చేశాయి. భరత్‌ను చూడటానికి అన్న రవితేజతోపాటు, విదేశాల్లో ఉన్న భరత్ భార్య కూడా చివరి చూపుకు రాలేదని సమాచారం.

 

యాక్సిడెంట్ స్పాట్ నుండి భరత్ భౌతిక కాయాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి... అటు నుండి అటే స్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. రవితేజ మరో సోదరుడు రఘు మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు కనీసం చివరి చూపుకు కూడా రాక పోవడం వెనక కారణం ఏమిటనేది ఎవరికీ అర్థం కావడం లేదు.

 

మరో వైపు తమ్ముడు చనిపోయిన మరుసటి రోజే రవితేజ చాలా సాధారణంగా షూటింగ్‌లో పాల్గొనడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ‘రాజా ది గ్రేట్' చిత్రంలో రవితేజ నటిస్తున్నాడు. అన్నపూర్ణ సూడియోలో షూటింగ్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘రాజా ది గ్రేట్' చిత్రం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. ఇక్కడ రవితేజ, హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. రవితేజ తమ్ముడి మరణంతో కొన్ని రోజుల పాటు షూటింగ్ వాయిదా వేయాల్సి వస్తుందని దర్శకుడు అనిల్ రావిపూడి భావించినా...  రవితేజ షూటింగ్ కొనసాగించాలని చెప్పి మరీ హాజరయ్యారట.

 

సొంత తమ్ముడు భరత్ మరణం తర్వాత రవితేజ వ్యవహారశైలి, జరుగుతున్న పరిణామాలపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సొంత సోదరుడు మరణిస్తే రవితేజ ఎలా షూటింగులో పాల్గొంటున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భరత్ లాంటి మరణం ఎవరికీ రావొద్దని, చాలా కాలంగా వివాదాలకు దూరంగా జీవనం సాగిస్తున్న భరత్.. ఒక స్టార్ హీరో సోదరుడై ఉండి కూడా ఇలా అనాధలా మరణించే పరిస్థితి ఏమిటని... టాలీవుడ్లో ఇలాంటి దుస్థితి ఎవరికీ రాలేదని, ఇకపై ఎవరికీ రాకూడదని, ఎంత చెడ్డవాడైన చనిపోయిన తర్వాత కూడా దూరం పెట్టడం ధర్మం కాదని అంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Harikrishna: ఆ శక్తి ఉంటే తప్పకుండా నందమూరి హరికృష్ణని బతికిస్తా.. ఎలాగో చెబుతూ కీరవాణి ఎమోషనల్ కామెంట్స్
Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌