భరత్ రాజుకు అదృష్టం వచ్చింది.. కానీ మృత్వువు లాక్కెళ్లింది

Published : Jun 26, 2017, 06:32 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
భరత్ రాజుకు అదృష్టం వచ్చింది.. కానీ మృత్వువు లాక్కెళ్లింది

సారాంశం

వివాదాలకు దూరమవుతూ మృత్యువుకు దగ్గరయ్యాడు రవితేజ సోదరుడు భరత్ కు సల్మాన్ బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం అంతలోనే ఘోరం జరిగిపోయిందని విలపిస్తున్న కుటుంబ సభ్యులు

గత కొంత కాలంగా పలు వివాదాలతో తెలుగు ప్రేక్షకులకు దూరమైన సినీ నటుడు,రవితేజ సోదరుడు భరత్ జీవితం గాడిన పడుతున్న సమయంలో అర్థాంతరంగా ముగిసిపోయింది. చెడు అలవాట్లకు దూరమై కెరీర్‌పై దృష్టిపెట్టిన భరత్‌ను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా భరత్ బతికుంటే మంచి వృద్ధిలోకి వచ్చేవాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.

 

డ్రగ్స్ వినియోగం, మద్యం సేవించడం లాంటి వ్యసనాలతో భరత్ వ్యక్తిగత జీవితం, సినీ నటుడిగా ప్రొఫెషనల్ జీవితం మసకబారింది. ఆ మధ్యకాలంలో కేసుల్లో చిక్కుకున్నాడు. వివాదాలతో భరత్ మీడియాలో ప్రముఖంగా మారాడు. ఈ మధ్యకాలంలో వివాదాలకు దూరం ఉంటూ కెరీర్‌ను చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడు. శరీరం, ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్‌ షోకు ఎంపికైనట్టు సమాచారం. బిగ్‌బాస్‌లోకి భరత్ జాతీయ స్థాయిలోని ఓ టెలివిజన్ ఛానెల్లో ప్రసారమయ్యే బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చిందట.

 

ఈ కార్యక్రమాన్ని కొన్నేండ్లుగా ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో సక్సెస్ తో తెలుగు, తమిళ భాషల్లోనూ షోను ప్లాన్ చేశారు. తెలుగు బిగ్ బాస్ గా ఎన్టీఆర్ వ్యవహరించనున్నారు. త్వరలో ప్రసారం కాబోయే బిగ్‌బాస్ రియాలిటీ సిరీస్‌లో పాల్గొనే అరుదైన అవకాశం సొంతం చేసుకున్న భరత్... ఆ కార్యక్రమంలో పాల్గొనే విషయంలోనే ఫిట్‌నెస్‌ను ఇంప్రూవ్ చేసుకొంటున్నట్టు సమాచారం.

 

ఫిట్‌నెస్ ఇంప్రూవ్‌మెంట్ కార్యక్రమంలో భాగంగానే భరత్ శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో స్విమ్మింగ్, జిమ్ చేస్తున్నట్టు సమాచారం. ఆ క్రమంలోనే శనివారం కూడా జిమ్, స్విమ్మింగ్ లాంటివి పూర్తి చేసుకొన్నట్టు తెలుస్తున్నది. నోవోటెల్ హోటల్ నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే భరత్ ప్రమాదానికి గురయ్యారు.

 

మరొక నెలలోనే బిగ్‌బాస్ షూటింగ్ మొదలు కానున్న నేపథ్యంలో.. ఫిట్‌నెస్ కోసం క్రమం తప్పకుండా స్విమ్మింగ్, జిమ్ చేస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఇంతలోనే భరత్‌ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. సల్మాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోలో పాల్గొని ఉంటే భరత్ కు దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చి ఉండేది.

PREV
click me!

Recommended Stories

Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?