ఉత్కంఠ పెంచేలా రవితేజ 70.. ఆ పోస్టర్ కి అర్థం ఏంటి..

pratap reddy   | Asianet News
Published : Oct 31, 2021, 12:15 PM ISTUpdated : Oct 31, 2021, 12:18 PM IST
ఉత్కంఠ పెంచేలా రవితేజ 70.. ఆ పోస్టర్ కి అర్థం ఏంటి..

సారాంశం

మాస్ మహారాజ్ రవితేజ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రవితేజ ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా చిత్రాల్లో నటిస్తున్నాడు. క్రాక్ బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ జోరు పెంచాడు.

మాస్ మహారాజ్ రవితేజ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రవితేజ ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా చిత్రాల్లో నటిస్తున్నాడు. క్రాక్ బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ జోరు పెంచాడు. గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మూడు చిత్రాలు కాకుండా రవితేజ 70వ  చిత్రానికి అనౌన్స్మెంట్ వచ్చింది. 

Swamy Rara ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో Ravi Teja తదుపరి చిత్రం ఉండబోతోంది. అనౌన్స్మెంట్ పోస్టర్ ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. పురాతన కట్టడాల్లో, ఆలయాల్లో ఉండే కళాకృతులు, శిల్పాలు ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాయి. ఇక పోస్టర్ పై 'హీరోస్ డోంట్ ఎక్సిస్ట్( హీరోలకు ఉనికి ఉండదు)' అనే ట్యాగ్ లైన్ ఆసక్తికరంగా ఉంది. 

చూస్తుంటే సుధీర్ వర్మ రవితేజ కోసం బలమైన కథ సిద్ధం చేసినట్లు అర్థం అవుతోంది. ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని నవంబర్ 5న 10.08 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీం వర్క్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అంటే రవితేజ కూడా ఈ చిత్రంలో నిర్మాణ భాగస్వామి.

 

సుధీర్ వర్మ స్వామిరారా చిత్రంతో ప్రతిభగల దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. దీనితో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని రవితేజ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ రాసుకున్నారట. టేకింగ్ లో మంచి అవుట్ పుట్ రాబడితే సూపర్ హిట్ ఖాయం. 

ఈ చిత్రంలో ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

Also Read: అయ్యో.. తప్పు పవన్ కళ్యాణ్ వైపే.. మహాభారతంలో కర్ణుడి పాత్ర ఫిక్స్, రాజమౌళి వైరల్ కామెంట్స్

PREV
click me!

Recommended Stories

Mohan Babu చిరంజీవి అన్నదమ్ములుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
Suma Rajeev Divorce: తల్లిదండ్రుల విడాకుల విషయంలో అసలు జరిగింది ఇదే.. చెప్పేసిన సుమ కొడుకు రోషన్