సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు

Siva Kodati |  
Published : Oct 31, 2021, 11:39 AM ISTUpdated : Oct 31, 2021, 11:42 AM IST
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు

సారాంశం

అలనాటి నటుడు కైకాల సత్యనారాయణ (kaikala satyanarayana) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం తన ఇంట్లో ఆయన జారిపడ్డారు. దీంతో గతరాత్రి కుటుంబసభ్యులు ఆయనను సికింద్రాబాద్‌లోని (secunderabad) ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు

అలనాటి నటుడు కైకాల సత్యనారాయణ (kaikala satyanarayana) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం తన ఇంట్లో ఆయన జారిపడ్డారు. దీంతో గతరాత్రి కుటుంబసభ్యులు ఆయనను సికింద్రాబాద్‌లోని (secunderabad) ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన పడాల్సి అవసరం లేదని కుటుంబసభ్యులు తెలియజేశారు. ప్రస్తుతం కైకాల వయస్సు 87 సంవత్సరాలు. 60 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో  777 సినిమాల్లో ఆయన నటించారు. ఎలాంటి పాత్రనైనా పోషించగల అతికొద్దిమంది నటుల్లో ఆయన కూడా ఒకరు. అందుకే కైకాలను ‘‘నవరస నటనా సార్వభౌమ’’ (navarasa natana sarvabhouma) అనే బిరుదుతో పిలుచుకుంటారు ప్రేక్షకులు. 

PREV
click me!

Recommended Stories

Mohan Babu చిరంజీవి అన్నదమ్ములుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
Suma Rajeev Divorce: తల్లిదండ్రుల విడాకుల విషయంలో అసలు జరిగింది ఇదే.. చెప్పేసిన సుమ కొడుకు రోషన్