Ravina Tandon : కార్గిల్ వార్ లోని బాంబ్ లపై తన పేరు ఉండటం పట్ల స్పందించిన ‘రవీనా టాండన్’..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 26, 2022, 06:05 PM IST
Ravina Tandon : కార్గిల్ వార్ లోని బాంబ్ లపై  తన పేరు ఉండటం పట్ల  స్పందించిన ‘రవీనా టాండన్’..!

సారాంశం

1999లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన కార్గిల్‌ యుద్ధంలో తన పేరు వినియోగించి బాంబ్స్ ను పాక్ కు పంపడం వంటి ఫొటోలు వైరల్ అయ్యాయి. దీని పట్ల రవీనా టాండన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా స్పందించారు.   

కార్గిల్ యుద్ధం సందర్భంగా పాక్‌ వైపు ‘రవీనా టాండన్‌ నుంచి నవాజ్‌ షరీఫ్‌కు ’ అని బాంబులపై రాసి పేల్చారు. అయితే ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.  ఈ విషయంపై స్పందించిన రవీనా టాండన్  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.  

భారత్ ను తమకు ఇస్తే కాశ్మీర్‌ను విడిచిపెడతామని పాకిస్తాన్ సైనికులు పలు సందేశాలతో భారత సైనికులను దూషించడం తెలిసిందే. అయితే భారత్ పర్యటనకు వచ్చిన  అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ ఒక సందర్భంలో మాట్లాడుతూ తనకు ఇష్టమైన బాలీవుడ్ నటి రవీనా అని కూడా చెప్పారు. ఆ తర్వాత కొన్నేండ్ల కోసారి రవీనా పేరు రాసి ఉన్న బాంబులను సరఫరా చేయడం లాంటి ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫొటోలు నెట్టింట వైర్ అవుతున్నాయి.     

 

ఈ విషయం చాలా రోజులు వరకు తనకు తెలియదని నటి రవీనా పేర్కొంది.  చాలా రోజుల తర్వాత తెలిసిందని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. హింస ద్వారా రెండు వర్గాల వారికి ప్రాణ నష్టమే అంటూ తెలిపింది. చర్చల ద్వారా సమస్యను  పరిష్కరించుకోగలమని సూచించింది. 

అయితే, తన వెబ్ సిరీస్ ‘ఆర్నాయక్’లో ప్రేమతో చర్చలు జరిపి మాట్లాడగలిగితే ఏ సమస్యనైనా జయించగలమని  తాను సలహా ఇస్తానంటూ తెలిపింది.  దేశం కోసం ప్రాణాలు అర్పించాల్సి వస్తే తాను తూపాకీ పట్టకుని ముందు నిలబడాతనని సిరీస్ లో చెప్పినట్టు తెలిపింది.  కాగా, ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో గతేడాది 10న విడుదల అయ్యింది. ఈ సిరీస్‌లో ఒక హత్య మిస్టరీని ఛేదించే SHO కస్తూరి డోగ్రా పాత్రలో నటించింది. 

PREV
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు