
జాన్వీ కపూర్ తన కేరీర్ పరంగా దూసుకెళ్లేందుకు స్పీడ్ పెంచింది. ఈ మేరకు వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఆమె నటించిన చిత్రాల్లో ఇప్పటికే రెండు చిత్రాలు ‘గుడ్ లక్ జెర్రీ’ ‘మిలి’ చిత్రీకరణను పూర్తి చేసుకున్నాయి. మరో సినిమా దోస్తానా 2 మూవీ కూడా చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా తాజా మరో చిత్రం ‘మిస్టర్ అండ్ మిస్ మహి’ మూవీ షూటింగ్ కూడా సిద్ధమవుతోంది ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ.
క్రికెట్ స్పోర్ట్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం జాన్వీ కపూర్ శిక్షణ పొందుతోంది. ఈ సందర్భంగా ఓ క్రికెట్ క్యాంప్ లో తన శిక్షణకు సంబంధించిన ఫొటోలను, తన టీమ్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో తన పాటు క్రికెటర్ దినేష్ కార్తీక్ మరియు వికెట్ కీపర్ శరణ్ శర్మ కూడా ఉన్నారు.
అయితే ఫొటోలను పోస్ట్ చేస్తూ జాన్వీ కపూర్ ఫోటోలను వివరించారు. ‘క్రికెట్ క్యాంప్ మిస్టర్ అండ్ మిస్ మహి’ అంటూ క్యాప్షన్ పెట్టింది. తన టీమ్ ఫోటోలను కూడా షేర్ చేసింది. ఈ ఫొటోలు తన రాబోయే చిత్రం నుంచి జాన్వీ కపూర్ లుక్ లాంటిగా భావించారు. ఈ మూవీలో స్టారర్ గా జాన్వీ కపూర్, రాజ్‌కుమార్ రావు నటిస్తున్నారు. వీరిద్దరూ ఇదివరకు రూహీ మూవీలో నటించారు. కాగా, మిస్టర్ అండ్ మిస్ మూవీని శరణ్ శర్మ డైరెక్ట్ చేయనున్నారు. నిఖిల్ మెహోత్ర రచయితగా పనిచేశారు.
జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అభిమానులను ఖుషీ చేసేందుకు తరుచూ సరికొత్త ఫొటో షూట్ లతో కనిపిస్తోంది. ఈ మేరకు కుర్రాళ్లను తనవైపు తిప్పుకునేందుకు గ్లామర్ షోను కూడా అదిరిపోయేలా చూపిస్తోంది జాన్వీ. ఇప్పటికే సోషల్ మీడియాలో తనకు ఫాలోయింగ్ ఉండటంతో తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలను చూసిన అభిమానులు నెక్ట్స్ మూవీపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వరుసగా సినిమాల్లో కనిపించి అలరించనుంది జాన్వీ కపూర్.