చిరంజీవి రిజెక్ట్ చేసిన కథకు ఓకే చెప్పిన ప్రభాస్.. నిజామా?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 26, 2022, 04:16 PM IST
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథకు ఓకే చెప్పిన ప్రభాస్.. నిజామా?

సారాంశం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతులో దాదాపు అరడజను పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభాస్ కొత్త చిత్రాలకు సైన్ చేయడం మాత్రం ఆపడం లేదు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతులో దాదాపు అరడజను పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభాస్ కొత్త చిత్రాలకు సైన్ చేయడం మాత్రం ఆపడం లేదు. ఇటీవల ప్రభాస్ కొత్తగా మరో చిత్రానికి ఓకె చెప్పిన సంగతి తెలిసిందే. 

సర్ ప్రైజింగ్ గా ప్రభాస్ డైరెక్టర్ మారుతికి ఓకె చెప్పాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. మారుతి ప్రధానంగా కామెడీపై ఫోకస్ పెట్టి తన కథలు సిద్ధం చేసుకుంటాడు. ఇది కూడా అలాంటి కథే అని తెలుస్తోంది. కేవలం రెండు నెలల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని ప్రభాస్ మారుతిని కోరాడు. 

ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి తాజాగా ఊహించని విషయం వెలుగులోకి వచ్చింది. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం జోరుగా చర్చ జరుగుతోంది. 

గతంలో చిరంజీవి, మారుతీ కాంబినేషన్ లో సినిమా అంటూ వార్తలు వచ్చాయి. మారుతి మెగాస్టార్ కి కథ కూడా వినిపించారని.. కానీ చిరంజీవి ఆ కథని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరో కొత్త పాయింట్ తో తన వద్దకు రావాలని చిరంజీవి మారుతికి చెప్పారట. 

మారుతి అదే కథని ప్రభాస్ కి చెప్పి ఒప్పించారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. మధ్యలో కాస్త రిలాక్స్ కోసం ప్రభాస్ ఈ కామెడీ ఎంటర్టైనర్ ట్రై చేయబోతున్నాడు. ఈ చిత్రానికి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా