తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

మామూలు షాక్ కాదుగా, బిగ్ బాస్ హౌస్ నుంచి రతిక ఎలిమినేటెడ్.. నాగ్ దగ్గర ఏడ్చేసిన ఫైర్ బ్రాండ్ 

Sreeharsha Gopagani | Published : Oct 1, 2023 10:24 PM

అందరూ ఆశ్చర్యపోయేలా రతిక బిగ్ బాస్ 7 నుంచి ఎలిమినేట్ అయింది. తేజ సేఫ్ అయ్యాడు. హౌస్ నుంచి వెళ్ళిపోతున్నందుకు రతిక కంటతడి పెట్టుకుంది. 

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో సండే ఎపిసోడ్ హీట్ పుట్టించేలా ప్రారంభం అయింది. దానికి కారణం శివాజీనే అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ హౌస్ మేట్స్ ఓట్లు అతడిని వ్యతిరేకంగా రావడంతో శివాజీ కంటెస్టెంట్ గా అర్హత కోల్పోయాడు. దీనితో శివాజీ బాగా మనస్తాపానికి గురయ్యాడు. 

సండే ఎపిసోడ్ ప్రారంభం కాగానే శివాజీ ఈ విషయంలో నాగార్జునని నిలదీశారు. ఆర్గుమెంట్ కి కూడా సిద్ధం అయ్యాడు. దీనితో నాగార్జున శివాజీకి వ్యతిరేకంగా ఓట్లు వేసి అభిప్రాయం చెప్పిన శోభా శెట్టి, ప్రియాంక, సందీప్ లని ప్రశ్నించారు. 

దీనితో శోభా శెట్టి మాట్లాడుతూ.. శివాజీ గారు యావర్, ప్రశాంత్ విషయంలో పక్షపాత ధోరణితో ఉన్నట్లు తెలిపింది. కానీ శివాజీ.. యావర్, ప్రశాంత్ లకు ఎలా పక్షపాతంతో వ్యవహరించారో వివరించలేకపోయింది. దీనితో నాగార్జున మీరు వివరణ సరిగ్గా లేదు అని చెప్పారు. నాగార్జున ప్రియాంక జైన్ అభిప్రాయం కూడా తీసుకున్నారు. శివాజీ కంటెస్టెంట్ అర్హత కోల్పోవడానికి సరైన కారణం లేదు. 

కానీ హౌస్ మేట్స్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ నిర్ణయాన్ని గౌరవయించాల్సిందే అని నాగార్జున శివాజీకి తెలిపారు. నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని శివాజీ తెలిపారు. ఇంతలో నామినేషన్స్ లో ఉన్న వారిలో నాగార్జున ప్రియాంకని సేవ్ చేశారు.  హీట్ ఆర్గుమెంట్ తర్వాత హౌస్ మేట్స్ మధ్య నాగార్జున ఫన్ గేమ్ నిర్వహించారు. సినిమా పేరుని బొమ్మగా గీసి టీమ్ కి హింట్ ఇవ్వాలి. టీమ్ ఆ సినిమా ఏంటో గుర్తు పట్టాలి. చాలా ఫన్ గా ఈ గేమ్ సాగింది. 

మధ్య మధ్యలో నామినేషన్స్ లో ఉన్న వారినిసేఫ్ చేసే ప్రక్రియ జరుగుతూ వచ్చింది. సెకండ్ రౌండ్ లో రతిక, తేజ, గౌతమ్, యావర్, శుభ శ్రీ నామినేషన్స్ లో ఉన్నారు. బజర్ నొక్కగానే గ్రీన్ లైట్ వెలిగిన వారు సేఫ్. రెడ్ వెలిగితే నాట్ సేఫ్. ఈ ప్రక్రియలో యావర్ సేఫ్ అయ్యాడు. తర్వాత గేమ్ మరికొంత సమయం కొనసాగింది. 

ఇక మూడవ రౌండ్ నామినేషన్స్ లో రతిక, తేజ, గౌతమ్, శుభశ్రీ ఉన్నారు. ఈ రౌండ్ లో నామినేషన్స్ లో ఉన్న వారికి పౌచ్ లు ఇచ్చారు. అందులో గ్రీన్ కాయిన్స్ ఉంటే సేఫ్.. రెడ్ ఉంటే నాట్ సేఫ్. ఈ రౌండ్ లో డాక్టర్ గౌతమ్ సేఫ్ అయ్యాడు. ఇక ఫైనల్ నామినేషన్స్ లో రతిక, శుభశ్రీ, తేజ మిగిలారు. తర్వాత ప్రక్రియలో ఒక పులి బొమ్మ ఇచ్చారు. 

పులి బొమ్మ పట్టుకున్నపుడు పులి సౌండ్ వస్తే సేఫ్. మేక సౌండ్ వస్తే నాట్ సేఫ్. ఈ రౌండ్ లో శుభ శ్రీ సేఫ్ అయింది. ఇక ఎలిమినేట్ కాబోయేది తేజ, రతిక లలో ఒకరు. చివరి దశలో ఉత్కంఠ నెలకొంది. వీరిద్దరికీ రెండు బ్లాస్టింగ్ గన్స్ ఇచ్చారు. నాగ్ కౌంట్ డౌన్ ముగియగానే ఎవరి గన్ బ్లాస్ట్ అవుతుందో వారు సేఫ్. బ్లాస్ట్ కానివారు నాట్ సేఫ్. రతిక గన్ బ్లాస్ట్ కాలేదు. దీనితో అందరూ ఆశ్చర్యపోయేలా రతిక బిగ్ బాస్ 7 నుంచి ఎలిమినేట్ అయింది. తేజ సేఫ్ అయ్యాడు. హౌస్ నుంచి వెళ్ళిపోతున్నందుకు రతిక కంటతడి పెట్టుకుంది. 

హౌస్ మేట్స్ ఆమెకి ఎమోషనల్ గా సెండాఫ్ ఇచ్చారు. నాగ్ దగ్గరకి వెళ్లిన తర్వాత కూడా రతిక కంటతడి పెట్టుకుంది. తన ఏవి చూస్తున్నంత సేపు రతిక ఎమోషనల్ అవుతూనే ఉంది. మొత్తంగా ఈ సండే జరిగిన ఎలిమినేషన్ సంచలనం అనే చెప్పాలి. 

click me!