
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇటీవల `కుబేర`తో ఆకట్టుకుంది. ఇందులో ఆమె కనిపించింది తక్కువ నిడివే అయినా ఆద్యంతం కట్టిపడేసింది. ఇప్పుడు `ది గర్ల్ ఫ్రెండ్` చిత్రంతో రాబోతుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది.
ఇందులో రష్మిక మందన్నాకి జోడీగా దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు అవుతుంది. కానీ షూటింగ్ కాస్త డిలే అయినట్టు తెలిసింది. ఎట్టకేలకు రిలీజ్‌కి రెడీ చేస్తున్నారు.
అందులో భాగంగానే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. `నదివే` అంటూ సాగే పాట బుధవారం సాయంత్రం విడుదల చేయగా, బ్యూటిఫుల్ మెలోడీగా సాగుతుంది. ఆద్యంతం మంత్రముగ్దుల్ని చేస్తుంది.
ఇందులో దీక్షిత్ శెట్టితో రష్మిక మందన్నా చేసే రచ్చ వేరే లెవల్లో ఉంది. ఆద్యంతం రొమాంటిక్, ఇంటెన్సిటీతో ఈ పాట సాగడం విశేషం. పాట లిరిక్, అలాగే ట్యూన్ కూడా అంతే కట్టిపడేసేలా ఉంది.
ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. రష్మికని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు అనేలా ఈ పాట ఉండటం విశేషం. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీనిపై చిత్ర బృందం రియాక్ట్ అయ్యింది.
`నదివే...' లిరికల్ సాంగ్ ను హిందీతో పాటు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం..ఐదు భాషల్లో రిలీజ్ చేశాం. 'నదివే...' పాటను బ్యూటిఫుల్ మెలొడీగా కంపోజ్ చేసి పాడారు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్. రాకేందు మౌళి లిరిక్స్ అందించారు.
'నదివే నువ్వు నదివే, నీ మార్పే రానుంది వినవే. నదివే నువ్వు నదివే..నీకే నువ్వియాలి విలువే..సిలువ బరువేమోయక, సులువు భవితే లేదుగా, వెన్నెల వలదను కలువే నువ్వుగా..నదివే నువ్వు నదివే..' అంటూ ప్రేయసి ప్రత్యేకతను పొగుడుతూ పొయెటిక్ గా సాగుతుంది.
ఈ పాటకి మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. చిత్రీకరణ తుది దశలో ఉన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చిత్ర యూనిట్ తెలిపారు.
ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్‌కి సంబంధించిన అప్ డేట్ వినిపిస్తుంది. సెప్టెంబర్ 5న విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
`పుష్ప2`, `కుబేర` వంటి హిట్ చిత్రాల తర్వాత రష్మిక నుంచి వస్తోన్న సినిమా కావడం, పైగా తనే మెయిన్ లీడ్‌గా నటించడంతో దీనిపై మంచి బజ్ నెలకొంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్న ఈ మూవీ ఆడియెన్స్ ని ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.