కింగ్డమ్ మూవీ నుంచి ఎమోషనల్ లిరికల్ సాంగ్.. అన్నదమ్ములుగా కట్టిపడేస్తున్న విజయ్, సత్యదేవ్

Published : Jul 16, 2025, 08:06 PM IST
Vijay Deverakonda Kingdom Movie

సారాంశం

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కింగ్డమ్'. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.

కింగ్డమ్ మూవీ నుంచి మరో లిరికల్ సాంగ్ 

 

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కింగ్డమ్'. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న 'కింగ్డమ్'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, 'హృదయం లోపల' అనే సాంగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ పాట 'అన్న అంటేనే' విడుదలైంది.

'కింగ్డమ్' నుంచి 'అన్న అంటేనే' లిరికల్ సాంగ్ ని బుధవారం(జూలై 16) సాయంత్రం విడుదల చేశారు నిర్మాతలు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. 'కింగ్డమ్' కోసం ఈ ఎమోషనల్ సాంగ్ ని స్వరపరిచారు. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఈ పాట ఉంది.

అన్నదమ్ముల అనుబంధాన్ని హైలైట్ చేస్తూ.. 

 

అన్నదమ్ముల అనుబంధాన్ని గుర్తు చేసేలా 'అన్న అంటేనే' పాట ఉంది. అన్నదమ్ములుగా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ కొత్తగా కనిపిస్తున్నారు. నిజ జీవితంలో అన్నదమ్ముల్లాగా తెరపై కనిపిస్తున్నారు. ఇద్దరూ తమదైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటలోని ఎమోషన్ ని పండించారు.  'అన్న అంటేనే' పాటని అనిరుధ్ స్వరపరచడంతో పాటు ఆలపించడం విశేషం. తనదైన సంగీతంతో, గాత్రంతో అనిరుధ్ మరోసారి కట్టిపడేశారు. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం అందరినీ కదిలించేలా ఉంది.

అంచనాలు పెంచుతున్న అప్డేట్స్ 

 

ప్రతిభగల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి 'కింగ్డమ్' కోసం అద్భుతమైన కథను ఎంచుకొని, ఆ కథను అంతే అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చి.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ అంచనాలను పెంచుతూనే ఉంది. ఈ చిత్రంలో పునర్జన్మల నేపథ్యం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ రెండు డిఫెరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నాడు. 

జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న 'కింగ్‌డమ్' చిత్రం.. ప్రేక్షకులను మునుపెన్నడూ చూడని గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించనుందని నిర్మాతలు హామీ ఇచ్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Katrina Kaif: బాలీవుడ్ లో రిజెక్ట్ చేయడంతో టాలీవుడ్ లో జాక్ పాట్.. ఒక్క హిట్ తో జాతకమే మారిపోయింది
Aamir Khan Marriage: ఆమిర్ మూడో పెళ్లికి మాజీ భార్యలు ఎందుకు రాలేదు? అసలు కారణం ఇదే!