రష్మిక మందన్నా మరోసారి లవ్‌ లో పడిందా?.. సక్సెస్‌ సీక్రెట్స్ బయటపెడుతూ ట్విస్ట్ ఇచ్చిన నేషనల్‌ క్రష్‌

By Aithagoni Raju  |  First Published Aug 23, 2024, 1:01 PM IST

రష్మిక మందన్నా ఇప్పటికే విజయ్ దేరవకొండతో ప్రేమలో ఉంది రష్మిక మందన్నా. తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చింది. కొత్త ప్రేమని కనిపెట్టిందట. అదే ఇప్పుడు హాట్‌ టాపిక్.
 


నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా ప్రస్తుతం సౌత్‌లో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ప్రస్తుతానికి ఆమెని మించిన హీరోయిన్‌ లేదని చెబితే అది అతిశయోక్తి కాదు. భారీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉందీ భామ. అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గానూ నిలిచింది. తెలుగు, హిందీలో మూవీస్‌ చేస్తూ మెప్పిస్తుంది. ఇటీవల హిందీలో `యానిమల్` సినిమా పెద్ద హిట్‌ కావడంతో అక్కడ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. మరోవైపు సౌత్‌లోనూ పాన్‌ ఇండియా చిత్రాల్లో నటిస్తూ దుమ్ములేపుతుంది నేషనల్‌ క్రష్‌.

ఈ క్రమంలో తాజాగా రష్మిక మందన్నా సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన సక్సెస్‌ సీక్రెట్స్ పంచుకుంది రష్మిక. తాను చేసే పనులు షేర్‌ చేసుకుంది. తనలోని భిన్నమైన కోణాలను బయటపెట్టింది. తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన విషయాలను పంచుకుంది రష్మిక మందన్నా. తనకిష్టమైన వాటిని కూడా వెల్లడించింది. మొత్తంగా తన సక్సెస్‌ సీక్రెట్‌ని వెల్లడించిందీ బ్యూటీ. ఇప్పటికే విజయ్‌ దేవరకొండతో ఆమె లవ్‌ లో ఉన్నట్టు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మరోసారి ఆమె ప్రేమలో పడిందట. లేటెస్ట్ గా పెద్ద ట్విస్ట్ ఇచ్చింది నేషనల్ క్రష్‌. 

Latest Videos

ఇందులో సంతోషంగా, ఆరోగ్యంగా, సక్సెస్‌ఫుల్‌గా రాణించడానికి కావాల్సినవి తెలిపింది. తాను ఏం పాటిస్తుందో చెప్పింది. దీనికి సంబంధించి డైరీలో రాసుకున్న విషయాలను వెల్లడించింది రష్మిక. ఆయా పనులు, వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో తన ఫుడ్‌ గురించి చెప్పింది. మనసుకి నచ్చిన ఫుడ్‌ తీసుకుంటుందట. అదే సమయంలో ఫిట్‌నెస్‌కి సంబంధించిన ఫుడ్‌ తీసుకుంటుందట. ఇప్పటికీ అంతే ఆరోగ్యంగా ఉండటం, జీవక్రియ బాగా ఉండటం ఆనందంగా ఉందని చెప్పింది రష్మిక మందన్నా. 

ఎప్పుడూ నవ్వుతూ ఉంటుందట. ఫన్‌ లేని జీవితం ఎందుకు? అని ప్రశ్నించింది. నిద్రకి కూడా ప్రయారిటీ ఇస్తుందట. టైమ్‌ దొరికితే నిద్ర పోతూ రిలాక్స్ అవుతానని నిద్ర అంటే తనకు ఇష్టమని చెప్పింది రష్మిక. ఈ క్రమంలో కొత్తగా లవ్‌ లో పడిందట. కొత్త ప్రేమని కనుగొన్నదట. పుస్తకాలతో ప్రేమలో పడినట్టు చెప్పింది రష్మిక మందన్నా. స్వీట్లు బాగా తింటుందట. తన లైఫ్‌లో ఎక్కువగా దానికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందని చెప్పింది. మరోవైపు ట్రావెల్‌ బాగా చేస్తుందట. లైఫ్‌లో అది రిఫెష్‌మెంట్‌ అని, చాలా విషయాలు తెలుస్తాయని, సాధ్యమైనంత వరకు ప్రయాణం చేయాలని దీని ద్వారా మానసిక స్థితి, శరీరం, మనస్సు, హృదయం ఇలా అన్నింటికి మంచిది అని చెప్పింది రష్మిక. 

తాను కొడవ అమ్మాయిని అని, చిన్నప్పట్నుంచి ఆ వాసనలు పీల్చుతూ పెరిగానని, ఇప్పుడు దాన్ని మిస్‌ అవుతున్నట్టు తెలిపింది. తన పెట్ ఆరా లేకుండా తాను లేనని, త్వరలోనే హైదరాబాద్‌ కి వస్తానని, మళ్లీ కలుస్తానని చెప్పింది రష్మిక. ఇక ఫైనల్‌గా వర్క్ చాలా ముఖ్యం అని, ఈ రోజు ఈస్థాయిలో, ఇలాంటి లైఫ్‌ గడపడానికి కారణమైనందుకు ధన్యవాదాలు తెలిపింది రష్మిక. ఇవన్నీ తనకు హ్యాపీని ఇస్తాయని, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణమని చెప్పింది. ఒకప్పుడు డైరీ రాసిన విషయాలను తెలిపింది. మళ్లీ డైరీ రాస్తానని తెలిపింది రష్మిక మందన్నా. 

ప్రస్తుతం రష్మిక తెలుగులో `పుష్ప 2`లో నటిస్తుంది. ఇది చిత్రీకరణ దశలో ఉంది. డిసెంబర్‌లో విడుదల కాబోతుంది. దీంతోపాటు `ది రెయిన్‌బో`, `ది గర్ల్‌ ఫ్రెండ్‌`, `కుబేరా` వంటి సినిమాలు చేస్తుంది. అలాగే హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో `సికందర్‌` మూవీ చేస్తుంది. ఇంకోవైపు ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీలోనూ రష్మికనే అడుగుతున్నారని సమచారం. 
 

click me!