ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకోనంటూ తెలుగు హీరోయిన్ కామెంట్

By Surya Prakash  |  First Published Aug 23, 2024, 12:41 PM IST

నేనూ ఓ నటిని, ఎంటర్‌టైన్‌ చేయడమే నా వృత్తి. అలాగని ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకోనంటూ సనమ్ శెట్టి (Sanam Shetty) వివాదాస్పద వాఖ్యలు చేసింది.  



గత కొంత కాలంగా అన్ని సినిమా  పరిశ్రమలకు చెందినవారు క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. చాలా మంది తాము స్వయంగా ఆ పరిస్దితులను ఎదుర్కొన్నామని ఓపెన్ గా చెప్తున్నారు. ఇండస్ట్రీ లో అన్ని రకాల వాళ్లు ఉన్నారని ,తాము ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పే మాటలు వైరల్ అవుతున్నాయి. తాజాగా తమిళ,తెలుగులో నటించిన న‌టి, బిగ్ బాస్ బ్యూటీ స‌న‌మ్ షెట్టి కూడా ఈ ఇష్యూపై మాట్లాడింది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో  బాగా వైర‌ల్ అవుతోంది.  తమిళంలోనూ క్య‌ాస్టింగ్ కౌచ్ ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. దర్శక నిర్మాతల నుంచి సమస్యలు ఎదురవుతున్నాయ‌ని ప్రెస్‌మీట్‌ పెట్టి  చెప్పుకొచ్చింది. 

స‌న‌మ్ షెట్టి మాట్లాడుతూ...  ఓ ఆడపిల్ల అనుమతి లేకుండా తాకడానికి ఎవరికీ అధికారం లేదు. అలాగే నేనూ ఓ నటిని, ఎంటర్‌టైన్‌ చేయడమే నా వృత్తి. అలాగని ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకోనంటూ సనమ్ శెట్టి (Sanam Shetty) వివాదాస్పద వాఖ్యలు చేసింది.  దీంతో సనమ్ వాఖ్యలపై ఇప్పుడు సోషల్ మీడియాలో  ట్రోల్ చేస్తున్నారు.‌ ఆమె అంటున్న మాటలను బట్టి సినిమాల్లో  ఆఫర్స్ లభించిన హీరోయిన్స్ అంతా శరీరాలను సమర్పించుకున్నట్లే వస్తుందని అంటున్నారు. 

Latest Videos

ఇక సనమ్ శెట్టి... 2012లో త‌మిళంలో వ‌చ్చిన అంబులి అనే సినిమాతో  హీరోయిన్ గా పరిచయం అయ్యింది.    మిస్ సౌత్ ఇండియా సనమ్ శెట్టి (Sanam Shetty) ఆ త‌ర్వాత త‌మిళంలో పాతిక సినిమాల వ‌ర‌కు చేసింది. కానీ కెరీర్ పరంగా పెద్దగా కలిసి వచ్చిందేమీ లేదు. ఇక  తెలుగులో మ‌హేశ్ బాబు శ్రీమంతుడులో ఓ చిన్న క్యారెక్ట‌ర్‌తో పాటు సంపూర్ణేశ్ బాబు సింగం 123, బిగ్‌మాస్ మాన‌స్ హీరోగా వ‌చ్చిన‌ ప్రేమికుడు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేసింది.

సనమ్ శెట్టి ఇదే విషయమై మాట్లాడుతూ...   స‌మాజం ఎంత మారినా, మ‌హిళ‌లు ఎంత ఉన్న‌త చ‌దువులు చ‌దివినా అన్ని రంగాల్లోనూ మహిళలకు వేధింపులు త‌ప్ప‌ట్లేదు.  మలయాళ ప‌రిశ్ర‌మ‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన‌ నివేదిక గురించి తెలిసి నేను షాకయ్యా .. అక్క‌డ ఉన్న అదేవిధమైన పరిస్థితులు తమిళ చిత్ర పరిశ్రమలోనూ ఉన్నాయి. ఇక్క‌డ జ‌రుగుతున్న అకృత్యాల‌ను బయటపెట్టడానికి ఎవరూ ముందుకురారని.. నేనూ ఇలాంటి చేదు సంఘటనలు ఎదుర్కొన్నా అన్నారు.
  
 అలాగే మహాలక్ష్మీ దేవి పూజను అందరూ జరుపుకుంటున్నామని.. కానీ మన మధ్య నడిచే దేవతలు అత్యాచారానికి, హత్యలకు గురవుతారని, ప్రాణాలు కాపాడే దేవదూత లాంటి ఓ డాక్టర్‌ను అనాగరికంగా హత్య చేస్తే.. కోల్‌కతాలో రీక్లెయిమ్ ది నైట్ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. నేను దానిని చెన్నైలో క్లెయిమ్ ది నైట్‌గా ప్రారంభించాలనుకుంటున్నా అన్నారు. ఈ నిరసనలో నాతో కలిసి బాధితురాలికి న్యాయం చేయడంలో సాయం చేయాలని కోరుతున్నానని శెట్టి ఈ సంద‌ర్భంగా తెలిపారు.  
 

click me!