రూ.54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డబుల్ ఇస్మార్ట్ మూవీ కేవలం రూ.12 కోట్ల తో సరి పెట్టుకుంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ గత చిత్రం ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద అనుకున్న విధంగా పెర్ఫామ్ చేయలేదు. ‘లైగర్’ డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాల్ని మిగిల్చింది. అయినా.. ‘డబుల్ ఇస్మార్ట్’ క్రేజ్ రిలీజ్ కు ముందు డబుల్ గా నడిచింది. అయితే ఎవరూ ఊహించని విధంగా సినిమా డబుల్ డిజాస్టర్ అయ్యింది. ఈ క్రమంలో ఎగ్జిబిటర్స్ నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి నిర్మాతలైన పూరి, ఛార్మీలకు ప్రెజర్ వస్తోందని సమాచారం.
అయితే హనుమాన్ నిర్మాతలు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు 'డబుల్ ఇస్మార్ట్' .. నార్త్ ఇండియా మినహా వరల్డ్ వైడ్ హక్కులను 54 కోట్లకు థియేటర్ హక్కులు తీసుకున్నారు. ఇది మాసివ్ డీల్. ఆగస్ట్ 15 రిలీజ్ డేట్ ఇవ్వటం బిగ్ హాలీడే వీకెండ్ కావటంతో కలెక్షన్స్ టాక్ తో సంభందం లేకుండా కుమ్మేస్తాయని భావించే అంత రేటు పెట్టి తీసుకున్నారు. అలాగే నాన్ రిఫండబుల్ బేసిస్ లో ఈ సినిమా తీసుకున్నారు. అంటే సినిమా హిట్ అయ్యినా ఫ్లాఫ్ అయినా నిర్మాతలకు ఏమీ సంభందం ఉండదు. కానీ ఈ స్దాయి డిజాస్టర్ అవటంతో ఇప్పుడు నిరంజన్ రెడ్డికి ఏదో విధంగా రికవరీ చేయాలనే నిర్ణయానికి పూరి జగన్నాథ్ వచ్చారట. డబుల్ ఇస్మార్ట్ మాత్రం మినిమం వసూళ్లు సాధించలేక పోయింది. రూ.54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డబుల్ ఇస్మార్ట్ మూవీ కేవలం రూ.12 కోట్ల తో సరి పెట్టుకుంది.
undefined
అందులో భాగంగా హీరో రామ్ తన రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వటానికి ముందుకు వచ్చారట. అలాగే పూరి జగన్నాథ్ ఓ ప్రపోజల్ పెట్టారట. అదేమిటంటే...ఈ నిర్మాతకు ఓ చిన్న సినిమా రెమ్యునేషన్ లేకుండా అతి తక్కువ బడ్జెట్, లొకేషన్స్ లో చేసి ఇస్తానని అన్నారట. అయితే హీరోగా తేజ సజ్జా (హనుమాన్ హీరో) ని అడిగారట. ఈ ప్రపోజల్ పై ఇంకా నిర్మాత నిరంజన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోలేదట. అయితే ఈ ప్రపోజల్ ఎక్కువ శాతం మెటీరియలైజ్ అయ్యే అవకాసం ఉందని అని చెప్తున్నారు.
ఇక ఈ ప్రాజెక్టు వల్ల పూరి నష్టపోయిందేమీ లేదంటున్నారు. సౌత్ ఇండియన్ లోని అన్ని భాషల ఓటీటీ రైట్స్ అమేజాన్ రూ.33 కోట్లకు చేజిక్కించుకొంది. ఆదిత్య సంస్థ ఆడియో రైట్స్ ని రూ.9 కోట్లకు కొనేసింది. ఇక హిందీ డబ్బింగ్, శాటిలైట్ రైట్స్, తెలుగు శాటిలైట్ హక్కులూ మంచి రేటుకే అమ్మారంటున్నారు. సంజయ్‌దత్ ఉన్నాడు కాబట్టి, హిందీ డబ్బింగ్ మంచి రేటే పలికే అవకాశం ఉంది. ఆ రూపేణా ఎటు చూసినా మరో రూ.20 కోట్ల వరకూ వచ్చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా డిజాస్టర్ అవటంతో ఇప్పుడు అంత సీన్ ఉండదు.