
టాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంటోంది. ఇటీవల క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ఫ’ (Pushpa) చిత్రంలో నటించింది. ఈ చిత్రం తెలుగు, హిందీలోనూ రిలీజై బ్లాక్ బాస్టర్ కావడంతో రష్మిక క్రేజ్ డబులైంది. మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)తో రొమాన్స్ చేసి సౌత్ ఆడియెన్స్ తో పాటు నార్త్ ఆడియెన్స్ కూడా అలరించింది. ఈ మేరకు టాలీవుడ్ నుంచి స్టార్ హీరోయిన్ ఎదిగి.. ఆల్ ఇండియన్ క్రష్ గా రష్మిక మండన్న పేరు తెచ్చుకుంది.
అయితే పుష్ప తర్వాత రష్మిక మండన్న నార్త్ పై పూర్తిగా ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ స్టార్స్ సరసన నటించేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసుకుంది. ఇప్పటికే హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ‘మిషన్ మంజు Mission Manju, గుడ్ బై Good Bye’ చిత్రాల్లో నటిస్తోంది. మరో ప్రాజెక్ట్ కు కూడా రష్మిక ఎంపికైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రష్మిక గుడ్ బై చిత్ర షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ ఫీచర్ ఫిల్మ్ కు వికాస్ బహ్లు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీజీ మోషన్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లపై చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), రష్మిక మండన్న, నీనా గుప్త ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా అమితాబ్ బచ్చన్, రష్మిక ఇద్దరూ కలిసి షూటింగ్ లో పాల్గొన్నారు. మొదటి సారి అమితాబ్ తో కలిసి నటిస్తుండటంతో రష్మిక ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. అమితాబ్ బచ్చన్ ను చూడగానే ఆనందంలో ముగిపోయిందంట. మరోవైపు బిగ్ బీ.. వారి షూటింగ్ స్పాట్ నుంచి ఓ ఫొటోను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ ‘పుష్ఫ..’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇందుకు రష్మిక స్పందిస్తూ ‘సార్ మనం తగ్గేదే లే’ అని కామెంట్ చేసింది. ఆ తర్వాత తను కూడా ఇన్ స్టాలో అదే పిక్ ను పోస్ట్ చేసింది. ‘అమితాబ్ బచ్చన్ కోసం కృతజ్ఞతతో కూడిన చిరునవ్వు, ప్రేమ’ అంటూ క్యాప్షన్ లో బచ్చన్ పై ఉన్న అభిమానాన్ని వ్యక్త పరిచింది. ఇక తెలుగులో ‘పుష్ఫ 2’ చిత్రంలోనూ రష్మిక నటిస్తోంది.