అభిమానుల అత్యుత్సాహం.. రష్మికకి పాలాభిషేకం!

Published : Mar 05, 2019, 10:51 AM IST
అభిమానుల అత్యుత్సాహం.. రష్మికకి పాలాభిషేకం!

సారాంశం

స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే థియేటర్ల ముందు భారీ కటౌట్ లు ఏర్పాటు చేయడం, వాటికి పాలాభిషేకాలు నిర్వహించడం చూస్తూనే ఉన్నాం. 

స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే థియేటర్ల ముందు భారీ కటౌట్ లు ఏర్పాటు చేయడం, వాటికి పాలాభిషేకాలు నిర్వహించడం చూస్తూనే ఉన్నాం. కానీ హీరోయిన్ కి కటౌట్ పెట్టి పాలాభిషేకాలు చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.

ఇప్పుడు అలాంటి సంఘటన చోటు చేసుకుంది. కన్నడంలో 'కిరాక్ పార్టీ' చిత్రంతో ఫేమస్ అయిన రష్మిక మందన్నా తెలుగులో కూడా 'ఛలో', 'గీత గోవిందం' వంటి చిత్రాలతో పాపులారిటీ దక్కించుకుంది. 

రీసెంట్ ఈమె నటించిన 'యాజమాన' సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ చాలెంజింగ్ స్టార్ దర్శన్ ఇందులో హీరోగా నటించారు. ఈ సందర్భంగా రష్మిక అభిమానులు థియేటర్ల ముందు ఆమె భారీ కటౌట్లు ఏర్పాటు చేసి వాటికి పాలాభిషేకాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రష్మిక అభిమానుల అత్యుత్సాహాన్ని కొందరు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం రష్మిక తెలుగులో 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తోంది. మేలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Nandamuri Chaitanya Krishna: మొదటి సినిమాలో తనకు జరిగిన అన్యాయంపై చైతన్య కృష్ణ ఆవేదన.. తప్పు జరిగింది అక్కడే
Youtuber Nandu: దోషిగా తేలితే యూట్యూబర్ నందుకి పడే శిక్ష ఏంటో తెలుసా? యూకే నుంచి బ్యాగు సర్దుకోవాల్సిందేనా?