తమన్నా, మెహ్రీన్ బికినీపై దర్శకేంద్రుడి కామెంట్స్ విన్నారా..?

Published : Mar 05, 2019, 10:22 AM IST
తమన్నా, మెహ్రీన్ బికినీపై దర్శకేంద్రుడి కామెంట్స్ విన్నారా..?

సారాంశం

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన 'ఎఫ్ 2' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఈ సినిమా యాభై రోజుల ఫంక్షన్ జరుపుకొంది. 

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన 'ఎఫ్ 2' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఈ సినిమా యాభై రోజుల ఫంక్షన్ జరుపుకొంది. ఈ వేడుకలో పాల్గొన్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. 

ఈ సందర్భంగా ఆయన సినిమాలో మెహ్రీన్, తమన్నాలు వేసుకున్న బికినీ సీన్ గురించి మాట్లాడి అందరినీ నవ్వించారు. ముందుగా ఈ సినిమా తనకు ఎంతగానో నచ్చిందని చెప్పిన దర్శకేంద్రుడు ఈ సినిమా తనను ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లిందని చెప్పారు. 

అనీల్ రావిపూడి సినిమాల్లో హెల్తీ కామెడీ ఉంటుందని, ఆయన సినిమాలంటే చాలా ఇష్టమని అన్నారు. సినిమాలో అన్ని పాత్రలు నవ్వించాయని.. ఈ సినిమా హిట్ అయిందంటే దానికి కారణం మెహ్రీన్, తమన్నాలను అందంగా చూపించడమనే అని అన్నారు.

స్విమ్ సూట్ లో ఇద్దరూ చాలా బాగున్నారని.. వారిని చూడడానికే జనాలు మళ్లీ మళ్లీ సినిమా చూశారని అందుకే సినిమా పెద్ద హిట్ అయిందని అన్నారు. అమ్మాయిలని కన్నీళ్లు కష్టాలు లేకుండా ఇలా గ్లామరస్ గా చూపించండి అంటూ దర్శకులకు సూచించారు. 
  

PREV
click me!

Recommended Stories

Daredevil: అజిత్ అభిమానులకు గుడ్ న్యూస్, షాలిని విషయంలో సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేసిన హీరో
Kiara Advani Festive Looks: పండగకి మెరిసిపోవాలా? కియారా బ్లింగ్ ఐడియాలు అదుర్స్..