దోమకొండ శివాలయంలో రామ్ చరణ్ పూజలు!

Published : Mar 05, 2019, 09:56 AM IST
దోమకొండ శివాలయంలో రామ్ చరణ్ పూజలు!

సారాంశం

సోమవారం శివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో శివుడ్ని పూజించారు. 

సోమవారం శివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో శివుడ్ని పూజించారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా భక్తిశ్రద్ధలతో శివలింగానికి పూజలు చేశారు.

కాకతీయుల కాలంలో 800 ఏళ్ల క్రితం నిర్మించిన దోమకొండ కోటలోని శివాలయాన్ని సందర్శించిన రామ్ చరణ్ శివుడ్ని పూజించారు. ఈ గుడిని తమ  పూర్వీకులు కట్టించారని చరణ్ భార్య ఉపాసన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

పంచె కట్టుకొని గుడికి వెళ్లిన రామ్ చరణ్ నీటితో స్వయంగా శివలింగాన్ని శుభ్రం చేసి పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ గుడి తెలంగాణా ప్రాంతంలో ప్రాచీన సంస్థానాల్లో ముఖ్యమైంది. కామారెడ్డి జిల్లలో ఈ సంస్థానం ఉంది. 

 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!