రూ.3 కోట్లు ఇవ్వండి.. అభిమానికి రష్మీ ఝలక్!

By Udayavani DhuliFirst Published 27, Aug 2018, 11:47 AM IST
Highlights

'జబర్దస్త్' షోతో బుల్లితెరపై విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న యాంకర్ రష్మి నటిగా కూడా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. 

'జబర్దస్త్' షోతో బుల్లితెరపై విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న యాంకర్ రష్మి నటిగా కూడా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. బుల్లితెరపై తన అందాలతో అందరినీ ఆకట్టుకున్న రష్మి ఇక వెండితెరపై మాత్రం ఊరుకుంటుందా..? ఏ సినిమా అయినా.. చెలరేగిపోయి మరీ నటిస్తుంటుంది. గ్లామర్ షో చేయడంలో ఎలాంటి నిబంధనలు పెట్టుకోలేని ఈ బ్యూటీ ఇటీవల 'అంతకుమించి' సినిమాలో నటించింది.

ఈ సినిమా కోసం రష్మి ఎంత చేసినా ఉపయోగం లేకుండా పోయింది. రష్మి అందాలు కూడా సినిమాకు ఓపెనింగ్స్ రాబట్టలేకపోయాయి. అయినప్పటికీ ఈ సినిమాను తన స్థాయిలో ప్రమోట్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించింది ఈ బ్యూటీ. ఈ క్రమంలో ఓ అభిమాని ఇతర దర్శకులతో సినిమాలు చేసే బదులు మీరే సొంతంగా మంచి సినిమాలు తీయొచ్చు కదా అంటూ ప్రశ్న వేశాడు.

ఈ ప్రశ్నకు సమాధానంగా రష్మి.. నా అకౌంట్ డీటైల్స్ మీకు పంపిస్తాను.. అందులో రూ.3 కోట్లు వేయండి.. నేనే సొంతంగా సినిమా చేస్తాను అంటూ అభిమానికి షాక్ ఇచ్చింది. దీంతో ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయాడు సదరు అభిమాని. 

ఇవి కూడా చదవండి.. 

కాస్టింగ్ కౌచ్ లో తప్పులేదు.. నేను దాన్ని గౌరవిస్తాను: రష్మి సంచలన కామెంట్స్!

సెక్స్ సింబల్ అనే ముద్ర పడిపోయింది.. రష్మి!

Last Updated 9, Sep 2018, 11:42 AM IST