నటిని వేధించించిన వ్యక్తి అరెస్ట్!

Published : Aug 27, 2018, 11:05 AM ISTUpdated : Sep 09, 2018, 11:42 AM IST
నటిని వేధించించిన వ్యక్తి అరెస్ట్!

సారాంశం

బాలీవుడ్ 'దంగల్' సినిమా నటించిన మైనర్ నటి జైరా వసీం గతేడాది విమానంలో ప్రయాణం చేస్తోన్న సమయంలో ఓ వ్యక్తి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే

బాలీవుడ్ 'దంగల్' సినిమా నటించిన మైనర్ నటి జైరా వసీం గతేడాది విమానంలో ప్రయాణం చేస్తోన్న సమయంలో ఓ వ్యక్తి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుండి ముంబైకి విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమె పక్కన ఉన్న ప్రయాణికుడు వికాస్ సచ్ దేవ్(39) ఆమెతో తప్పుగా ప్రవర్తిస్తూ తాకరాని చోట తాకుతుండడంతో అది భరించలేని జైరా ఓ వీడియో ద్వారా ఈ విషయాన్ని అందరికీ చెబుతూ కన్నీటి పర్యంతమైంది.

దీంతో అతడి మీద కేసు నమోదైంది. తాజాగా అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దిన్ దోషి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ విషయంపై స్పందించిన వికాస్.. తాను అలసిపోయి గాఢనిద్రలో ఉన్నానని.. ఏం చేశానో తనకు తెలియదని తెలిపాడు. కావాలనే అతడిపై ఆరోపణలు చేస్తున్నారని అంటున్నాడు.

వికాస్ తరఫు లాయర్ కూడా అతడికి మద్దతునిస్తూ నిజంగా విమానంలో అలాంటి పరిస్థితి ఎదురై ఉంటే సదరు నటి అక్కడున్న అలారంను ఎందుకు మోగించలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై కోర్టులో పోరాడతామని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

యాంకర్ శ్రీముఖికి షాకిచ్చిన స్టార్ మా.. ఆమె షో మరో యాంకర్ చేతిలోకి...
Double Elimination: బిగ్‌ బాస్‌ తెలుగు 9 డబుల్‌ ఎలిమినేషన్‌, 14వ వారం ఈ ఇద్దరు ఔట్‌.. టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే