రామ్ ట్వీటేసాడు..ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు

Surya Prakash   | Asianet News
Published : Jun 24, 2021, 04:59 PM IST
రామ్ ట్వీటేసాడు..ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు

సారాంశం

పవన్‌ కుమార్‌ సమర్పణలో ‘రాపో 19’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం యాక్షన్‌ ఎంటర్‌టైన‌ర్‌ అలరించడంతో పాటు, సామాజిక సందేశాన్ని అందివ్వనుందట.

 రామ్‌ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్. శ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌ పవర్‌పుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో నటించనున్నాడట. పవన్‌ కుమార్‌ సమర్పణలో ‘రాపో 19’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం యాక్షన్‌ ఎంటర్‌టైన‌ర్‌ అలరించడంతో పాటు, సామాజిక సందేశాన్ని అందివ్వనుందట. ఈ సినిమా ఫైనల్ నేరేషన్ పూర్తైందని, ఇక షూటింగ్ ప్రారంభం కావటమే ఆలస్యం అని రామ్ ట్వీట్ చేసి అభిమానుల్లో ఆనందం నింపారు.

మొత్తానికి ఫైనల్ నెరేషన్ పూర్తి అయింది.. అదిరిపోయింది.. లవ్యూ లింగుస్వామి సర్.. సూపర్ డూపర్‌గా ఉంది.. ఇక మొదలుపెట్టేద్దాం అంటూ రామ్ రెడీగా ఉన్నట్టు తెలిపారు. ఇక వచ్చే నెలలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక  లింగుస్వామి అనగానే తెలుగు ప్రేక్షకులకు మొదట గుర్తుకొచ్చేది ‘పందెంకోడి’ సినిమానే. అది ప్రేక్షకుల ముందుకొచ్చి చాలా యేళ్లే అయినా ఇప్పటికీ ఆ చిత్రాన్ని మరిచిపోలేదు. రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యాన్ని అందులో మేళవించిన తీరు ఆకట్టుకుంది. అదే తరహా సీమ టచ్‌తో లింగుస్వామి చేసే ఈ సినిమా కూడా తెరకెక్కనుందని సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. రామ్‌ పోలీస్‌గా సందడి చేయనున్నట్టు సమాచారం. ఈ కథలో రాయలసీమ నేపథ్యం ఉంటుందని తెలిసింది.  ఈ సినిమాలో ఓ డిఫరెంట్ మేనరిజంతో, పూర్తి రాయలసీమ స్లాంగ్ తో రామ్ అదరకొట్టబోతన్నారట.  

శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాణ సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం.  లింగు స్వామీ ఇప్పటికే ఆవారా, సికిందర్ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. మరి రామ్‌తో అతడు ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. మరో ప్రక్క రామ్ ఇప్పటికే వెంకీ కుడుముల చెప్పిన ప్రేమకథను రిజెక్ట్ చేశారు. దాంతో రామ్ తన తదుపరి చిత్రంగా పక్కా మాస్ సబ్జెక్టుని ఎంచుకుంటారని తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు