జగన్‌తో చిరు మీటింగ్..ఆ సమస్య పరిష్కారం కోసమే!?

By Surya PrakashFirst Published Jun 24, 2021, 4:01 PM IST
Highlights

 త్వరలోనే జగన్, చిరంజీవి సమావేశం కాబోతున్నారనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ వార్తలో ఎంత నిజముందో అనేది తెలియదు. అలాగే సమావేశానికి కారణం రాజకీయమే అంటూ  వార్తలు వస్తున్నాయి. 

బ్లడ్‌ బ్యాంక్‌ తరహాలోనే ఆక్సిజన్ బ్యాంకులను సిద్దం చేసి, సామాన్యులకు ఊపిరి పోస్తున్న చిరంజీవి… తాజాగా మెగా వాక్సినేషన్ నిర్వహించిన ఏపీ సిఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ చేపట్టడం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఓకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. కోవిడ్‌ మహమ్మారి కట్టడి కోసం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రయత్నాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభినందించారు. కోవిడ్‌ నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.

 ఈ నేపధ్యంలో త్వరలోనే జగన్, చిరంజీవి సమావేశం కాబోతున్నారనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ వార్తలో ఎంత నిజముందో అనేది తెలియదు. అలాగే సమావేశానికి కారణం రాజకీయమే అంటూ  వార్తలు వస్తున్నాయి. అయితే అలాంటిదేమి లేదని కేవలం సినిమాలకు చేయూత ఇవ్వటానికే చిరంజీవి ఆయన్ను కలవబోతున్నారంటూ మెగాభిమానులు క్లారిటీ ఇస్తున్నారు. మరి చిరంజీవి ..జగన్ ని కలిసి ఏం మాట్లాడబోతున్నారు.
 
సెకండ్ వేవ్ తీవ్రత తగ్గటంతో తెలుగు రెండు రాష్ట్రాల్లో జాలై నెలలో సినిమా హాళ్లు తెరవాలని థియేటర్ యాజమాన్యాలు నిర్ణయించాయి. దానికి తోడు  చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.  అయితే రిలీజ్ అంటే థియోటర్స్ ఉంటే చాలు . కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.  అదే తగ్గిన టికెట్ ధరలు. వకీల్ సాబ్ రిలీజ్ సమయంలో ...లాక్ డౌన్ ముందు ప్రభుత్వం టికెట్ రేట్లను భారీగా తగ్గించింది. ఈ ధరలతో సినిమా హాళ్లు నడపడం వీలుపడదని అప్పుడే ఓనర్లు చేతులు చెప్పేశారు.

 మళ్లీ ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అవుతున్న వేళ అవే ధరలు కొనసాగిస్తే నష్టాలు తప్పవని భావిస్తున్నారు. అప్పుడు నిర్మాతలు కూడా తక్కు వ రేట్లకే సినిమాల ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో సినిమా పెద్దలు సైతం ఈ రేట్లతో సినిమాలు రిలీజ్ చేస్తే నష్టపోవలసి వస్తుందని భావిస్తున్నారు. దానికి తోడు ఆగష్టు నెల నుండి ‘ఆచార్య, అఖండ, ఖిలాడి, రాధేశ్యామ్, కేజీఎఫ్ 2, పుష్ప’ లాంటి సినిమాలు విడుదలకానున్నాయి.

దాంతో ఇదే పెద్ద సమస్యగా మారనుంది. ఈ సమస్యను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించుకోవాలి. అదే అందరి తాపత్రయం. ఈ క్రమంలో  ఈ విషయమై సీఎం జగన్ వద్దకు వెళ్లాలని సినీ పెద్దలు నిర్ణయించారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో కొంతమంది జగన్ వద్దకు వెళ్లి టికెట్ ధరలను పెంచాలని ప్రపోజల్ పెడతారని తెలుస్తోంది. గతంలో  లాక్ డౌన్ సమయంలో కూడ చిరంజీవి సినిమా హాళ్ల ఓపెనింగ్ విషయమై ముఖ్యమంత్రితో చర్చలు జరిపి సత్పలితాలు రాబట్టిన సంగతి తెలిసిందే. దాంతో చిరంజీవేనే ఈ విషయమై మాట్లాడాలని ఇండస్ట్రీ పెద్దలు కోరుతున్నారట. అదీ విషయం.

click me!