సమంత కొడుకు పాత్రలో రావు రమేష్!

By Udayavani DhuliFirst Published Dec 21, 2018, 1:09 PM IST
Highlights

తన గ్లామర్ తో యూత్ ని కట్టిపడేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత ఇప్పుడు వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేస్తుంది.

తన గ్లామర్ తో యూత్ ని కట్టిపడేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత ఇప్పుడు వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేస్తుంది. 'రాజు గారి గది2'లో దెయ్యం పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ 'మహానటి','యూటర్న్' చిత్రాల్లో జర్నలిస్ట్ గా కనిపించి తమ నటనతో మెస్మరైజ్ చేసింది.

ఇప్పుడు మరో వైవిధ్యమైన పాత్రలో నటించడానికి సిద్ధమవుతోంది. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి రూపొందిస్తోన్న ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సమంత. కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కి రీమేక్ గా ఈ సినిమాను రూపొందించబోతున్నారు.

70ఏళ్ల వృద్ధురాలు.. 20 ఏళ్ల యువతిగా మారడమనే సరికొత్త పాయింట్ తో సినిమా ఉంటుంది. కథ ప్రకారం డెబ్బై ఏళ్ల పాత్రలో కనిపించే సమంతకి ఓ కొడుకు ఉంటాడట. ఆ కొడుకు పాత్ర కోసం రావు రమేష్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. 

కథలో తన పాత్రకి ప్రాముఖ్యత ఉండడంతో రావు రమేష్ కూడా సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. సినిమాలో మెయిన్ హైలైట్ ఇదేనని అంటున్నారు. సమంత, రావు రమేష్ ల మధ్య నడిచే సంభాషణలు ఆకట్టుకునే విధంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ సినిమాకి 'ఓ బేబీ ఎంత సక్కగున్నావే' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. 
 

click me!