Rangamaarthanda : ఓటీటీలోకి వచ్చిన ‘రంగమార్తాండ’.. ఎక్కడ చూడొచ్చు?

By Asianet News  |  First Published Apr 7, 2023, 3:54 PM IST

రంగస్థల నటీనటుల జీవితంగా వచ్చిన ‘రంగమార్తాండ’ థియేటర్లలో ప్రేక్షకుల హృదయాలను కదిలించిన విషయం తెలిసిందే. తాజాగా చిత్రం ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. 


వెర్సటైల్ యాక్టర్ ప్రకాశ్‌రాజ్‌, సీనియర్ నటి రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda). రంగస్థల నటీనటుల జీవితాన్ని ఆధారంగా చేసుకుని మరాఠిలో తెరకెక్కిన సక్సెస్ ఫుల్ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు రీమేక్ గా వచ్చింది.  గతనెల మార్చి 22న థియేటర్లలో విడుదలైన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా సినీ తారలను కదిలించిందీ చిత్రం.

బ్రహ్మనందం, ప్రకాష్ రాజ్, రమ్య  క్రిష్ణ నటనకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా నటుడు,  డాక్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం నటనతో ప్రేక్షకులు సైతం కంటతటి పెట్టించారు. ఆయన కేరీర్ లోనే బెస్ట్ మూవీస్ లలో‘రంగమార్తాండ’ చోటుసంపాదించుకుంది. ఇక రిలీజ్ కు ముందుకు ముందు కూడా ప్రీమియర్స్ ద్వారా సినిమాను వీక్షించిన నటీనటులు, దర్శకులు చాలా ఎమోషనల్ అయ్యారు. 

Latest Videos

ఇలా సినిమా ప్రపంచంలో వారితోపాటు ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకున్న ఈచిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ  ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈరోజు నుంచే ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ప్రైమ్ మీడియో అప్డేట్ అందించింది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిత్రాన్ని హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందించారు. మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన షాయరీని స్వయంగా తన గొంతుతో పాడారు. రంగస్థల కళాకారుల జీవితాల చుట్టూ అల్లిన ఈ కథలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, బ్రహ్మానందంతో పాటు రాహుల్ సిప్లిగంజ్, శివాని రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజ, అనసూయ, కీలక పాత్రల్లో అలరించారు.

story of an extraordinary theatre artist and the unexpected changes in his life when he decides to retire ✨, watch now https://t.co/woDFJ0AJwD pic.twitter.com/0vQgtKa4NB

— prime video IN (@PrimeVideoIN)
click me!