Time100 పోల్ లో షారుఖ్ ఖాన్ సత్తా.. వరల్డ్ మోస్ట్ ఇన్ ఫ్లూయెన్సర్ గా బాలీవుడ్ బాద్షా..

Published : Apr 07, 2023, 02:09 PM ISTUpdated : Apr 07, 2023, 02:17 PM IST
Time100 పోల్ లో షారుఖ్ ఖాన్ సత్తా.. వరల్డ్ మోస్ట్ ఇన్ ఫ్లూయెన్సర్ గా బాలీవుడ్ బాద్షా..

సారాంశం

2023 Time100 రీడర్ పోల్  విన్నర్ గా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ నిలిచారు. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వక్యులతో నిర్వహించిన టైమ్ పోల్ లో బాలీవుడ్ కింగ్ ఖాన్ అత్యధిక ఓట్లను దక్కించుకుని టాప్ లో ఉన్నారు. 

ఇండియాస్ మోస్ట్ ఫేమస్ యాక్టర్స్ లో బాలీవుడ్ స్టార్ షారుఖాన్ (Shah Rukh Khan) ఒకరు. బాలీవుడ్ రొమాంటిక్ హీరోగా,  కింగ్ ఖాన్ గా షారుఖ్ ముద్ర వేసుకున్నారు. మూడు దశాబ్దాలుగా వందకు పైగా చిత్రాల్లో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకున్నారు.  మరోవైను అంతర్జాతీయంగానూ షారుఖ్ కు ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అమెరికన్ న్యూస్ మ్యాగజైన్ Time నిర్వహించిన వరల్డ్ మోస్ట్ ఇన్  ఫ్లూయెనర్స్ వార్షిక జాబితాను విడుదల చేసింది. 

ఈ జాబితాలో ప్రపంచంలోనే  అత్యంత ప్రభావవంతమైన పొలిటిషన్స్, సినీ స్టార్స్, వైద్య నిపుణులు, వ్యాపారవేత్తలు ఉంటారు. 2023 Time 100 రీడర్ పోల్ లో షారుఖ్ ఖాన్ విజయం సాధించారు. టైమ్ మ్యాగజైన్ పోల్ కోసం పాఠకులు పోల్ చేసిన 1.2 మిలియన్ల ఓట్లలో 4 శాతం షారూఖ్ ఖాన్ పొందారు. పోల్ లో హాలీవుడ్ నటుడు మిచెల్ యోహ్, అథ్లెట్ సెరెనా విలియమ్స్, మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్, బ్రెజిలియన్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా, లియోనెల్ మెస్సీ కూడా కనిపించారు. అత్యధిక ఓట్లతో కింగ్ ఖాన్  విజయం సాధించారు. 

ప్రపంచంలోనే మోస్ట్ ఇన్ ఫ్ల్యూయెన్సర్ గా టాప్ లో షారుఖ్ ఖాన్ నిలవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక రీసెంట్ గా షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ Pathaanతో సెన్సేషన్ క్రియేట్ చేసిన  విషయం తెలిసిందే. షారుఖ్ కేరీర్ లోనే హ్యాయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా నిలిచింది. బాలీవుడ్ కు కొత్త బలాన్ని ఇచ్చింది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో వస్తున్న ‘జవాన్’ Jawan చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు చిత్ర షూటింగ్ పూర్తి కావచ్చింది. 2023 జూన్ 2న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode:కార్తీక్‍కి ముద్దు పెట్టబోయిన జ్యో-చెంపపై కొట్టిన దీప-షాకిచ్చిన జ్యో
Illu Illalu Pillalu April 13 Episode: నర్మద కాపురంలో చిచ్చుపెట్టిన భాగ్యం వల్లీ, లారీ గురించి ఆరాతీస్తున్న నర్మద