రణ్‌బీర్, యష్‌, సాయిపల్లవిల `రామాయణం` స్టార్ట్ అయ్యేది అప్పుడే

Published : Dec 13, 2023, 06:28 PM IST
రణ్‌బీర్, యష్‌, సాయిపల్లవిల `రామాయణం` స్టార్ట్ అయ్యేది అప్పుడే

సారాంశం

రామాయణం ఆధారంగా మరో సినిమా రాబోతుంది. ఇందులో రణ్‌బీర్‌, యష్‌, సాయి పల్లవి నటించనున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. 

ఇండియన్‌ సినిమా బాక్సాఫీసు లెక్కలు మారిపోయాయి. ఇప్పుడు భారీ స్కేల్‌లో తీసిన సినిమాలు భారీ వసూళ్లని రాబడుతున్నాయి. దీంతో ప్రయోగాలకు మేకర్స్ సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రామాయణం ఆధారంగా `ఆదిపురుష్‌` చిత్రం వచ్చింది. ప్రభాస్‌ రాముడిగా నటించారు. కృతి సనన్‌ సీతగా, సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడిగా నటించారు. ఈ మూవీ డిజప్పాయింట్‌ చేసింది. కొత్తగా చెప్పలేకపోవడం, డెంప్త్ లోకి వెళ్లలేకపోవడం, విజువల్స్ నాసిరకంగా ఉండటం, ప్రభాస్‌ చాలా వరకు యానిమేటెడ్‌గా కనిపించడంతో ఆడియెన్స్ తిరస్కరించారు. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో రామాయణం రాబోతుంది. రామాయణం ఆధారంగా మరో సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్‌ జరుగుతుంది. బాలీవుడ్‌ దర్శకుడు నితేష్‌ తివారి దీన్ని రూపొందించబోతున్నారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. రావణుడిగా `కేజీఎఫ్‌` స్టార్‌ యష్‌ నటిస్తారని సమాచారం. ఇక సీతగా సాయిపల్లవి నటిస్తుందని తెలుస్తుంది. చాలా కాలంగా ఈ మూవీకి సంబంధించిన చర్చ జరిగింది. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. రణ్‌ బీర్‌ కపూర్‌ నటించిన `యానిమల్‌` మూవీ ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించింది. ఏడు వందల కోట్లు దాటి దూసుకుపోతుంది. వెయ్యి కోట్ల దిశగా రన్‌ అవుతుంది. దీంతో నిర్మాతకు ధైర్యం వచ్చింది. ఈ సినిమాని పట్టాలెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ సరికొత్త అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ మూవీని వచ్చే ఏడాది ప్రారంభించబోతున్నారట. మార్చిలో సినిమాని స్టార్ట్ చేయబోతున్నారట. 

రణ్‌బీర్‌ కపూర్‌ ప్రస్తుతం బ్రేక్‌ తీసుకుంటున్నారు. తనకు కూతురు పుట్టిన విషయం తెలిసిందే. కొన్నాళ్లపాటు కూతురుతో ఆడుకోవాలనుకుంటున్నారు రణ్‌బీర్. ఫ్యామిలీకే టైమ్‌ కేటాయించాలని భావిస్తున్నారు. ఆరు నెలల పాటు ఆయన బ్రేక్‌ తీసుకోవాలనుకుంటున్నారు. ఆ తర్వాత ఈ మూవీని స్టార్ట్ చేయబోతున్నారట. ఈ మూవీని మూడు పార్ట్ లుగా తెరకెక్కించబోతున్నారట. మొదటి పార్ట్ ని 2025లో విడుదల చేయాలనుకుంటున్నారట. సినిమాలో హనుమంతుడి పాత్రని సన్నీ డియోల్‌ పోషించే అవకాశం ఉందట. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే