విజయ్ దేవరకొండపై యూట్యూబ్‌లో అసభ్యకర వార్తలు.. వ్యక్తి అరెస్ట్..

Published : Dec 13, 2023, 05:35 PM IST
విజయ్ దేవరకొండపై యూట్యూబ్‌లో అసభ్యకర వార్తలు.. వ్యక్తి అరెస్ట్..

సారాంశం

విజయ్‌ దేవరకొండపై గత కొన్ని రోజులుగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో అసభ్యకరమైన వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండపై అసభ్యకర వార్తలు ప్రసారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబ్‌లో విజయ్‌కి సంబంధించి గౌరవాన్ని దెబ్బతీసేలా, పరువు నష్టం కలిగేలా ఆయన వార్తలను ప్రసారం చేస్తున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో రంగంలోకి దిగారు. అతన్ని ఎట్టకేలకు పట్టుకుని అరెస్ట్ చేశారు. కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరి వివరాల్లోకి వెళితే.. 

విజయ్‌ దేవరకొండ హీరోగా విశేష గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయనకు ఇండియా వైడ్‌గా ఫాలోయింగ్‌ ఏర్పడింది. రౌడీ బాయ్‌గా ఆయన్ని అభిమానులు పిలుచుకుంటున్నారు. ఇటీవల `ఖుషి`తో హిట్‌ అందుకున్న విజయ్‌ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో `ఫ్యామిలీ స్టార్‌` చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే అనంతరపురానికి చెందిన వెంకట కిరణ్‌.. సినీ పోలిస్‌ అనే యూట్యూబ్‌లో ఛానెల్‌లో తరచూ విజయ్‌ దేవరకొండపై అసభ్యకరమైన వార్తలు ప్రసారం అవుతున్నాయి. కొన్ని రోజులుగా ఆయన సినిమాలకు సంబంధించిన అసభ్యకరమైన వార్తలను ప్రసారం చేశారు. అలాగే అయన్ని, ఆయన సినిమాల్లోని హీరోయిన్లని అవమానిస్తూ వీడియోలు చేశారు. 

దీంతో ఈ విషయం విజయ్‌ టీమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు వెంకట కిరణ్‌ ఆచూకి కనిపెట్టింది.  2590/2023 గా కేసును ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా కొన్ని గంటల వ్యవధిలోనే సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వీడియోలనీ, ఛానల్ ని డిలీట్ చేయించారు. అంతేకాదు భవిష్యత్ లో ఇలాంటివి చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇది మాత్రమే కాదు టార్గెటెడ్ గా ఎవరు వ్యాఖ్యలు చేసినా, మీడియా మాధ్యమాలలో అవమానిస్తున్నట్లు వార్తలు ప్రసారం చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించడం గమనార్హం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:కాశీతో స్వప్నగొడవ-ఇంట్లో నుంచి పొమ్మన్న కావేరి-దీపపై నిందేసిన కాంచన
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్, మోక్షజ్ఞ సినిమాకు న్యూ ఇయర్ లో మోక్షం, డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?