పాకిస్థానీ సినిమాల్లో నటిస్తా.. వివాదాస్పద వ్యాఖ్యలపై రణ్ బీర్ క్లారిటీ

Published : Feb 26, 2023, 12:08 PM IST
పాకిస్థానీ సినిమాల్లో నటిస్తా..  వివాదాస్పద వ్యాఖ్యలపై రణ్ బీర్ క్లారిటీ

సారాంశం

గతంలో తాను చేసి వ్యాఖ్యలపై ప్రస్తుతం క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్యంగ్ స్టార్ రణ్ బీర్ కపూర్. పాకీస్తానీ సినిమాల్లో నటిస్తాను అంటూ తాను మాట్లాడిన మాటలు.. సందర్భంగ గురించి వివరించారు బాలీవుడ్ స్టార్ హీరో. 

ఇండియా పాకిస్తాన్ మధ్య పరిస్థితి ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఇక ఇండియన్ సినిమాలు.. పాకిస్తాన్ లో విపరీతమైన క్రేజ్ తోనడుస్తాయి.. పాకిస్తాన్ నుంచి నటులు ఇండియాకు వచ్చి ఇక్కడ సినిమాలు చేస్తుంటారు. కాని మనవాళ్లు పాకిస్తాన్ సినిమాల్లో తొందరగా నటించరు.అసలు నటించే ఛాన్స్ కూడా ఉండదు. ఒకవేళ నటిస్తామన్నా..దారుణంగా ట్రోల్స్ కు గురవుతుంటారు. ప్రస్తుతం ఆ పరిస్థితిని రణ్ బీర్ కపూర్ అనుభివిస్తున్నారు. దానిపై క్లారిటీ కూడా ఇచ్చారు యంగ్ హీరో.

మన దేశానికి, పాకిస్థాన్ కి  మధ్య పచ్చగడ్డి కూడా భగ్గున మండుతుందన్న సంగతి తెలిసిందే.. ఇక దాని వల్ల ఇక్కడ ఎవరైనా పాకిస్థాన్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే  విమర్శలు తప్పవు. అయితే బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్.. సపోర్ట్ చేయడం కాదు కాని.. అక్కడ సినిమా రంగం గురించి మాట్లాడాడు. పాకిస్తాన్ సినిమాలు చేస్తాను అన్నాడు.. అంతే అప్పటి నుంచి దారుణమైన  విమర్శలు రణబీర్ కపూర్ ఎదుర్కున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గతేడాది డిసెంబర్ లో రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. 

ఆ ఫిలిం ఫెస్టివల్ లో ఓ పాకిస్థాన్ నిర్మాత ఒకరు రణ్ బీర్ ను కలిసి ఓ మాట అడిగాడు..  పాకిస్థానీ సినిమాల్లో నటించే అవకాశం వస్తే చేస్తారా అని అడగగా దానికి రణబీర్.. కచ్చితంగా నటిస్తాను, ఆర్టిస్టులకు, కళలకు హద్దులు ఉండవని నేను నమ్ముతాను అని అన్నారు. దీంతో రణబీర్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. దేశ వ్యాప్తంగా వివాదం అయ్యాయి. ఇక సోషల్ మీడియాలో సోకాల్డ్ నెటిజన్లు కొంత మంది రణ్ బీర్ ను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు పాకిస్థాన్ సినిమాల్లో  నటిస్తా అని ఎలా చెప్పగలిగావు అంటూ ఫైర్ అయ్యారు. 

ఇక గతంలో చేసిన వ్యాఖ్యలకు తాజాగా క్లారిటీ ఇచ్చాడు రణబీర్ కపూర్.  ప్రస్తుతం ఆయన తన నెక్స్ట్ సినిమా బిజీలో ఉన్నాడు.  తు ఝూతి మైన్ మక్కార్ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నాడు.  ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా క వరుస ఇంటర్వ్యూలతో పాటు.. వరుసగా ఈవెంట్స్ లో పాల్గోంటున్నాడు. ఇక రీసెంట్ గా  జరిగిన ఓ ప్రెస్ మీట్ లో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధాణాలు చెపుతూ..ఈ వ్యాఖ్యలపై కూడా క్లారిటీ ఇచ్చాడు  రణబీర్.

ఇక ప్రెస్ మీట్ లో  ఈ వివాదంపై రణబీర్ కు వరుస ప్రశ్నలు ఎదురయ్యాయి.. వాటిపై స్పందిస్తూ..నేను మాట్లాడిన మాటలు తప్పుగా అర్ధం చేసుకున్నారు. నేను ఆ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్ళాక అక్కడికి చాలా మంది పాకిస్థాన్ సినీ పరిశ్రమ వాళ్ళు కూడా వచ్చారు. అలాంటి సందర్భంలో ఈ ప్రశ్న అడిగారు. అప్పుడు అక్కడ వివాదం అవ్వకూడదు అని నేను నటిస్తాను అని చెప్పాను. నాకు సినిమాలే ముఖ్యం. నాకు చాలా మంది పాకిస్థాన్ సినీ వ్యక్తులు తెలుసు. వాళ్ళు ఇండియన్ సినిమాల్లో పనిచేస్తున్నారు. సినిమాకు, కళకు హద్దులు ఉండవని నేను నమ్ముతాను అన్నారు. 

ఇక అంతే కాదు...  కళ కంటే దేశం పెద్దది. అలాంటి సమయంలో నేను దేశానికే మొదటి ప్రాధాన్యత ఇస్తాను అని ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు రణ్ బీర్. ఇక ఈక్లారిటీతో విమర్షలు ఆగుతాయి అని అంతా అనుకుంటున్నారు. మరి రణ్ బీర్ పై ట్రోల్స్ ఆగుతాయా..? కొత్తవి మొదలవుతాయా చూడాలి మరి. గతంలో కూడా రణ్ బీర్ ఇలాంటి చాలా  వివాదాల్లో చిక్కున్నాడు. బీఫ్ తింటాను అని చెప్పడంతో..బ్రహ్మాస్త్రా ప్రమోషన్స్ టైమ్ లో ఓ గుళ్ళోకి రాకుండా రణ్ బీర్ ను.. ఆలియాను అడ్డుకున్నారు జనాలు. మరెన్నో వివాదాలు రణ్ బీర్ కెరీర్ లో ఉన్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే