పెళ్ళి హడావిడికి పేకప్ చెప్పి.. షూటింగ్ కోసం మేకప్ వేసుకుంటున్న కియారా అద్వాని, వైరల్ అవుతున్న పోస్ట్

Published : Feb 26, 2023, 11:03 AM IST
పెళ్ళి హడావిడికి పేకప్ చెప్పి.. షూటింగ్ కోసం మేకప్ వేసుకుంటున్న కియారా అద్వాని, వైరల్ అవుతున్న పోస్ట్

సారాంశం

హంగామ అంతా అయిపోయింది..ఇక బ్యాక్ టు వర్క్ అంటోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వాని. స్టార్ట్ ..కెమెరా ..యాక్షన్ కు రెడీ అయ్యింది. 

చాలా కాలంగా సీక్రెట్ గా ప్రేమలో మునిగితేలింది బాలీవుడ్ జంట కియార అద్వాని -సిద్దార్థ్ మల్హోత్రా.  మా మధ్య ఏం లేదు అంటూనే సడెన్ గా పెళ్ళి బాజాలుకూడా మోగించు. పెళ్ళి కూడా చేసేకున్నారు. రాజస్థాన్ లోని  జైసల్మీర్ లో ఫిబ్రవరి 7న తక్కువ మంది అతిధుల మధ్య.. అంగరంగ వైభవంగా ఒక్కటయ్యారు కియారా, సిద్దార్ధ్. ఇక పెళ్ళి తరువాత ముంబయ్ లో సెలబ్రిటీల కోసం ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేశారు ఈ జంట. ఈక్రమంలోనే.. పెళ్ళి కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకుని.. దాదాపు  20 రోజులు సెలవు తీసుకున్న కియారా.. ఇక బ్యాక్ టూ వర్క్ అంటోంది. 

అవును ఇన్ని రోజులు సరదాగా ఎంజాయ్ చేసి ఇప్పుడు బ్యాక్ టు వర్క్ అవుతున్నారు. తాజాగా కియారా బ్యాక్ టు వర్క్ అంటూ.. సోషల్ మీడియాలో  ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం చేతి నిండా సినిమా ఆఫర్స్ తో బిజీగా ఉంది కియారాఅద్వానీ. ప్రస్తుతం రామ్ చరణ్ -శంకర్ సినిమాతో పాటు ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ సగంలో ఉన్నాయి. రామ్ చరణ్ మూవీ షూటింగ్ క్లైమాక్స్ స్టేజ్ లో ఉంది. అయితే మొన్నటి వరకూ సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరిగింది కాని. శంకర్ భారతీయుడు2 షూటింగ్ కోసం రామ్ చరణ్ మూవీకి 30 రోజులు సెలవు ప్రకటించడంతో.. షూటింగ్ కు బ్రేక్ పడింది. అందులోను  చరణ్ ఆస్కార్ హడావిడిలో అమెరికాలో ఉన్నాడు. దీంతో ఈ షూట్ కొన్ని రోజులు వాయిదా పడింది. 

ఇక  ఇన్ని రోజులు పెళ్లి పనులతో బిజీ బిజీగా..  హడావిడిగా ఉన్న కియారా. పెళ్ళి అలసట తీర్చుకుని.. ఫ్రెష్ లుక్ తో షూటింగ్స్ కు రెడీ అయిపోయింది. తన ఇన్స్టా గ్రామ్ లో  తాజాగా బ్యాక్ టు వర్క్ అంటూ  స్టోరీ కూడా పెట్టింది బ్యూటీ. షూటింగ్ స్పాట్ లో మేకప్ వేసుకుంటూ ఓ మిర్రర్ సెల్ఫీ పోస్ట్ చేసింది. బాలీవుడ్ సినిమా షూటింగ్ లో బిజీ అయిపొయింది కియారా. ఈఫోటో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక పెళ్లితరువాత కూడా కెరీర్ నుఇలాగా కొనసాగించగనుంది బ్యూటీ. 

చాలా కాలం సీక్రేట్ ప్రేమను కొనసాగించారు కియారా అద్వాని..  సిద్దార్ధ్. చెట్టా పట్టాలు వేసుకుని తిరిగినా.. తమ మధ్య ఏమీలేదు అన్నట్టే బిహేవ్ చేశారు. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి అన్నట్టు సమాధానం కూడా చెప్పింది ఒసందర్భంలో కియారా అద్వాని.  ఏం తెలియనట్టే ఉన్న ఈ జంట సడెన్ గా పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?