ఎన్టీఆర్-చరణ్ ఫ్యాన్స్ కొట్టుకోకండి... ఆర్ ఆర్ ఆర్ లో బెస్ట్ ఎవరో  ఆ రోజు తేలిపోతుంది!

Published : Feb 26, 2023, 11:52 AM IST
ఎన్టీఆర్-చరణ్ ఫ్యాన్స్ కొట్టుకోకండి... ఆర్ ఆర్ ఆర్ లో బెస్ట్ ఎవరో  ఆ రోజు తేలిపోతుంది!

సారాంశం

ఆర్ ఆర్ ఆర్ హీరోల్లో ఎవరు గొప్ప? ఎన్టీఆర్-చరణ్ లలో ఎవరిది బెస్ట్ పెరఫార్మన్స్? అనే వాదన నడుస్తుండగా దీనికి ఒక పరిష్కారం దొరికింది.   

ఆర్ ఆర్ ఆర్ హీరోలు ఇద్దరూ ఒకే కేటగిరీలో నామినేట్ కావడం అరుదైన విషయం. ఈ పరిణామంతో ఓ వాదనకు పరిష్కారం దొరకనుండి. ఆర్ ఆర్ ఆర్ విడుదలకు ముందు నుంచే ఎన్టీఆర్-రామ్ చరణ్ ల పాత్రల నిడివి, ప్రాధాన్యత విషయంలో ఎవరి వైపు రాజమౌళి మొగ్గుచూపుతారు. ఎవరు ఎవరిని డామినేట్ చేయనున్నారు? అనే సందేహాలు నెలకొన్నాయి. ఇక మూవీ  విడుదలైనప్పటి నుండి ఎన్టీఆర్-రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది. మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని కొట్టుకుంటున్నారు. 

అంతర్జాతీయ గుర్తింపు విషయంలో కూడా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా వార్స్ కి దిగుతున్నారు. ప్రముఖ మ్యాగజైన్ వెరైటీ ఎన్టీఆర్ పేరు ఆస్కార్ ప్రిడిక్షన్స్ లిస్ట్ లో పెట్టింది. దాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకున్నారు. మావాడిదే పైచేయి అయ్యిందంటూ ప్రచారం చేసుకున్నారు. ఆస్కార్ నామినేషన్స్ లో ఎన్టీఆర్ పేరుంటుందని వారు భావించారు. కానీ ఆయనకు నిరాశ ఎదురైంది. మరోవైపు రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు వేడుకకు గౌరవ అతిథిగా హాజరయ్యారు. తన చేతుల మీదుగా ఒక అవార్డు ప్రధానం చేయడంతో పాటు స్పాట్ లైట్ అవార్డుకి ఎంపికయ్యారు. 

అయితే ఆర్ ఆర్ ఆర్ హీరోల్లో ఎవరు బెస్ట్ అని తేల్చే పరిణామం చోటు చేసుకోనుంది. క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ కి ఎన్టీఆర్, రామ్ చరణ్ నామినేట్ అయ్యారు. హాలీవుడ్ సూపర్ స్టార్స్ టామ్ క్రూజ్, బ్రాడ్ ఫిట్, నికోలస్ కేజ్ లతో వీరిద్దరూ తలపడనున్నారు. బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీస్ కేటగిరీలో ఎన్టీఆర్, చరణ్ లకు నామినేషన్స్ దక్కాయి. దీంతో హాలీవుడ్ దిగ్గజ నటుల సరసన వీరు నిలిచారు. దీంతో ఈ అవార్డు ఎవరు దక్కించుకుంటే వారు బెస్ట్ అని పరోక్షంగా చెప్పినట్లే. అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్ కాకుండా లిస్ట్ లో ముగ్గురు హాలీవుడ్ నటుల్లో ఒకరు గెలుచుకుంటే ఆ ప్రశ్న అలానే ఉండిపోతుంది. ఎన్టీఆర్-రామ్ చరణ్ లలో ఎవరో ఒకరు గెల్చుకుంటే... హాలీవుడ్ దృష్టిలో ఆ హీరో బెస్ట్ అనే నిర్ణయానికి ఫ్యాన్స్ రావచ్చు. మార్చి 16న విన్నర్స్ ని ప్రకటించనున్నారు. ఆ రోజు ఆర్ ఆర్ ఆర్ హీరోల్లో ఎవరు గొప్పో ఒకింత స్పష్టత రానుందని టాలీవుడ్ వర్గాల భావన. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?