నెం.1 ఎవరు? అంటున్న రానా.. ఎన్టీఆర్ కు పోటీ

Published : Jun 15, 2017, 09:48 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
నెం.1 ఎవరు? అంటున్న రానా.. ఎన్టీఆర్ కు పోటీ

సారాంశం

తెలుగు బుల్లి తెరపై మరో బడా హీరో జెమిని టీవీలో నెంబర్ 1 యారి అనే షోకు హోస్ట్ గా రానా ఇప్పటికే స్టార్ మా బిగ్ బాస్ హోస్ట్ గా ఎన్టీఆర్ ఎవరు నెంబర్ వన్ అనేది రేటింగ్సే తేల్చాలి  

నంబర్‌ వన్‌ ఎవరు? అంటున్నారు రానా! ఇప్పుడీ నంబర్ల గోల ఎందుకు? అంటే... త్వరలో ఆయన బుల్లితెరపై అడుగుపెట్టనున్నారు. ‘నెం.1 యారి’ అనే టీవీ కార్యక్రమానికి రానా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ‘యారి’ అంటే ‘ఎవరు’ అని అర్థం అయ్యుండొచ్చు. ఈ కార్యక్రమం జెమిని టీవీలో ప్రసారం కానుంది. నిన్న ఈ న్యూస్‌ కన్ఫర్మ్‌ చేసిన రానా, ‘నెం.1 యారి’ టీజర్‌ విడుదల చేశారు.

మరో వైపు స్టార్ మా ఛానెల్ ప్రసారం చేయనున్న ‘బిగ్‌ బాస్‌’కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఇప్పుడీ ‘నెం.1 యారి’కి రానా.. మరి హోస్ట్‌గా టీవీపై.. అడుగుపెట్టే తదుపరి యంగ్‌ హీరో ఎవరో? వీళ్ల బాటలో ఇంకెంతమంది నడుస్తారో!!
 

మొత్తానికి తమ అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు బుల్లితెరను వాడేసుకుంటున్నారు మన హీరోలు. అటు టీవీ ఛానెల్స్ కూాడా వీళ్ల క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి.

PREV
click me!

Recommended Stories

రాంచరణ్, బాలకృష్ణ ఇద్దరికీ చుక్కలు చూపించిన వెంకటేష్..పెద్ద హంగామాతో వచ్చి తుస్సుమన్న సూపర్ స్టార్
Heroes Salaries: 2006లో మన స్టార్‌ హీరోల రెమ్యూనరేషన్స్ ఎంతో తెలుసా? అస్సలు ఊహించరు