హీరోయిన్ గా రానున్న జీవిత రాజశేఖర్ ల కుమార్తె శివానీ

First Published Jun 15, 2017, 9:32 PM IST
Highlights
  • హీరోయిన్ గా రానున్న జీవిత రాజశేఖర్ ల కుమార్తె శివానీ
  • ప్రస్థుతం ఎంబీబీఎస్ చదువుతున్న శివాని
  • తమిళ పరిశ్రమ ద్వారా ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్స్

జీవిత రాజశేఖర్‌ దంపతులు ఏ వేడుకకి వెళ్లినా తప్పకుండా తమ ఇద్దరు కూతుళ్లను వెంట తీసుకెళ్తుంటారు. కుటుంబ విలువలకు రాజశేఖర్‌ ఎప్పుడూ పెద్దపీట వేస్తుంటారు. వీరి పెద్దమ్మాయి శివాని హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. శివాని ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్నారు. తమిళ చిత్ర పరిశ్రమ ద్వారా ఎంట్రీ ఇవ్వడానికి సర్వ సన్నాహాలు చేసుకుంటున్నారు. శివాని మాట్లాడుతూ ‘‘చిన్నతనం నుంచి భరతనాట్యం, కూచిపూడి నేర్చుకున్నా. సంగీతంలో అభినివేశం ఉంది. కీ బోర్డు, గిటార్‌, వీణ చక్కగా వాయిస్తాను. నేను, నా సోదరి శివాత్మిక యూట్యూబ్‌ చూస్తూ పాడుతూ ఉంటాం. ప్రస్తుతం మేమిద్దరం కిక్‌ బాక్సింగ్‌ నేర్చుకుంటున్నాం. నాకు ఫిట్‌నెస్‌ అంటే చాలా ఇష్టం.

 

నేను పుట్టింది చెన్నై అయినా పెరిగిందంతా హైదరాబాద్‌లో. ఇప్పటికీ మా బంధువులందరూ చెన్నైలో ఉంటారు. తమిళ్‌ బాగా మాట్లాడుతాను. ప్రస్తుతం ఎంబీబీయస్‌ మూడో సంవత్సరం చదువుతున్నాను. తమిళ్‌ సినిమాలన్నీ చూస్తాను. ధనుష్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నటించిన ‘3’ సినిమా చూసి ఎమోషనల్‌ అయి ఏడ్చేశాను. విశాల్‌ మేన్లీగా కనిపిస్తారు. విజయ్‌ సేతుపతి నటన నాకు బాగా నచ్చుతుంది. ఆయన ఎంపిక చేసుకునే కథలన్నీ సెన్సిబుల్‌గా ఉంటాయి. మా నాన్న నా ఆల్‌టైమ్‌ ఫేవరేట్‌ హీరో. అమ్మానాన్నలు కలిసి నటించిన సినిమాలన్నిటినీ చూశాను. ముందు డాక్టర్‌ అయి, ఆ తర్వాత యాక్టర్‌ అవుతాను’’ అని అంటోంది శివాని.

click me!