రానా సినిమాకు ఫైనాన్స్ సమస్యలు, సగంలోనే ఆగిపోయింది?

By Udaya DFirst Published Feb 3, 2019, 9:07 AM IST
Highlights

స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు,  బాహుబలి, ఘాజి చిత్రాలతో  భారీ స్టార్‌డమ్ సంపాదించుకున్న హీరో, తెలుగు, హిందీ, తమిళ,మళయాళ భాషల్లో మార్కెట్ ఉన్న స్టార్  దగ్గుపాటి రానా. ఆయన సినిమాకు ఆర్దిక కష్టాలు వచ్చి ఆగిపోవటం అంటే వినటానికి వింతగానే ఉంటుంది

స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు,  బాహుబలి, ఘాజి చిత్రాలతో  భారీ స్టార్‌డమ్ సంపాదించుకున్న హీరో, తెలుగు, హిందీ, తమిళ,మళయాళ భాషల్లో మార్కెట్ ఉన్న స్టార్  దగ్గుపాటి రానా. ఆయన సినిమాకు ఆర్దిక కష్టాలు వచ్చి ఆగిపోవటం అంటే వినటానికి వింతగానే ఉంటుంది. ఎందుకంటే సినిమా ప్రారంభించే ముందే అవన్నీ క్రాస్ చెక్ చేసే రానా ముందుకు వెళ్తారు. అందుకు ఆయన అనుభవం, పరిచయాలు బాగా ఉపయోగపడతాయి. అయినా సరే..ప్రాజెక్టు ప్రారంభం అయ్యాక సమస్యలు వస్తే వాటిని తను స్వయంగా ఫేస్ చేయగలరు. అలాంటి సామర్ధ్యం ఉన్న రానా సినిమా పై ఈ వార్త ఎందుకు వచ్చినట్లు..

అందుతున్న సమాచారం మేరకు రానా  హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న 1945  సినిమా ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.  వాస్తవానికి 2018 వేసవి సెలవుల్లోనే ఈ సినిమా విడుదలవుతుందనే టాక్ వినిపించినప్పటికీ.. అప్పుడు అలా జరగకపోవడానికి కారణం ఆ సినిమాను వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులే  అంటున్నారు.1945' సినిమా 50 శాతం చిత్రీకరణను జరుపుకుంది. 

సత్య శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రానా సరసన రెజినా క్యాసండ్రా జంటగా కనిపిస్తోంది. 1945లో దేశ విభజనకు ముందున్నప్పటి పరిస్థితుల నేపథ్యంతో, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఓ సైనికుడి పాత్రలో రానా కనిపించనున్నాడు.

తమిళంలో 'మదై తిరంతు' అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో నాజర్, సత్యరాజ్, ఆర్.జే. బాలాజీ వంటి నటులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నిధులను సమకూర్చుకోవడానికి నిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తేనే మళ్లీ ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు.  

click me!