
తెలుగులో శర్వానంద్ సరసన `రాజు మహరాజు` చిత్రంలో నటించింది సుర్వీన్ చావ్లా. ఇందులో శర్వాకి జోడీగా చేసింది. కేవలం ఒకే ఒక్క చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత కనుమరుగయ్యింది. ఇక హిందీలో మాత్రం `హేట్ స్టోరీ 2`,`పార్డ్చ్`, `సేక్రెడ్ గేమ్స్` వంటి చాలా సినిమా్లో నటించి మెప్పించింది. సంచలనం సృష్టించించింది.
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇండియన్ టెలివిజన్ పరిశ్రమ గురించి బహిరంగంగా మాట్లాడారు. ఆమె చెప్పిన కొన్ని విషయాలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. సినిమాల్లోకి రాకముందు, సుర్వీన్ చావ్లా 'కహీ తో హోగా' అనే టెలివిజన్ షోతో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ సీరియల్ సమయంలో ఎదురైన అనుభవాలను పంచుకుంది.
“నేను బాలాజీ టెలిఫిల్మ్స్ కోసం వారానికి నాలుగు రోజులు షూటింగ్ చేసేదాన్ని. ఆ టైమ్‌లో నా తలపై కొండచరియలు విరిగిపడ్డట్టు ఉండేది. ఈ రంగంలో నాకు అనుభవం లేదు. నా డైలాగ్ డెలివరిని చూసి జనాలు నవ్వేవారు.
టెలివిజన్‌లో మనల్ని పశువుల్లా చూస్తారు. ఇది ఒక ఫ్యాక్టరీ లాంటిది. గడువులోపు ఎపిసోడ్‌లు అందించాలి. ఈ విషయంలో మీరు కేవలం కార్మికులు. వ్యవస్థలో మీరు ఒక ఉత్పత్తి మాత్రమే” అని సుర్వీన్ అన్నారు.
సుర్వీన్ 'కహీ తో హోగా' అనుభవం గురించి మాట్లాడుతూ, “ఒక వింత దర్శకుడు కూడా ఉన్నారు. చాలా మంది మహిళలకు ఆయనతో పనిచేయడానికి ఇబ్బంది ఉండేది. కానీ ఆయన నిర్మాణ సంస్థకి ఇష్టమైన వాడు. మమ్మల్ని బలిపశువుల్లా చూసేవారు. పని జరుగుతున్నంత వరకు ఏదీ పట్టించుకోరు - ఏది సరైనది, ఏది తప్పు అన్నది ఉండదు” అని చెప్పారు.
సుర్వీన్ చావ్లా ఇటీవల `క్రిమినల్ జస్టిస్` నాల్గవ సీజన్‌లో కనిపించారు. ఈ సిరీస్‌లో ఆమె 'అంజు నాగ్‌పాల్' పాత్ర పోషించారు. ఇప్పుడు వెంకటేష్, రానా నటిస్తున్న `రానా నాయుడు` సీజన్ 2లో కూడా నటిస్తున్నారు. ఇది జూన్ 13, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.