చిన్మయి సింగర్‌గా బ్యాన్ చేయడానికి కారణమేంటి? ఆ స్టార్‌ రైటర్‌తో గొడవే కారణమా?

Published : Jun 03, 2025, 08:19 PM IST
chinmayi

సారాంశం

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పాపులర్‌ అయిన చిన్మయి మంచి గాయని కూడా. ఆమె గతంలో చాలా సినిమాలకు పాటలు పాడింది. అయితే గాయనిగా ఆమెకి తమిళంలో ఇటీవల అవకాశాలు ఎందుకు రావట్లేదో చాలా మందికి తెలీదు.  ఆ కథేంటో ఇందులో తెలుసుకుందాం. 

చిన్మయికి తమిళంలో అవకాశాలు ఎందుకు లేవు?

‘థగ్‌ లైఫ్’ సినిమా ఆడియో ఫంక్షన్ లో సింగర్ చిన్మయి “ముత్త మళై..” పాట పాడింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంచి గొంతు ఉన్న చిన్మయికి తమిళంలో అవకాశాలు ఎందుకు రావట్లేదో చాలా మందికి తెలీదు.  

చిన్మయిని బ్యాన్ చేసిన `నడిఘర్‌ సంఘం`

2002లో వచ్చిన ‘కన్నతిల్ ముత్తమిట్టాల్’ సినిమాలో “ఒరు దైవం తంద పూవే..” పాటతో తమిళ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది చిన్మయి. ఆ తర్వాత వేల పాటలు పాడింది.

 కానీ చిన్మయికి డబ్బింగ్, పాటలు పాడటానికి తమిళ ఇండస్ట్రీలో బ్యాన్ వేశారు. దాంతో తెలుగు, హిందీ వంటి వేరే భాషల్లో పని చేస్తోంది. అప్పటి నటుల సంఘం(నడిఘర్‌ సంఘం) సెక్రటరీ రాధారవి దీనిపై స్పందించారు. ఓ రిపోర్టర్‌ ఆమెని ప్రశ్నించగా, 

సభ్యత్వం ఫీజు కట్టలేదని చిన్మయిని తొలగించారు

దానికి రాధారవి స్పందిస్తూ, చిన్మయి తన ఏడాది సభ్యత్వం ఫీజు కట్టలేదు. దాని గురించి ఆమెను అడిగారు. కానీ మాతో మాట్లాడకుండా కోర్టుకి వెళ్ళింది. అక్కడ జీవితకాల సభ్యత్వం తీసుకున్నానని అబద్ధం చెప్పింది. అందుకే ఆమెను బ్యాన్ చేశాం` అని చెప్పారు. 

కానీ రాధారవి చెప్పిన దానికి యాంకర్ అభ్యంతరం చెప్పారు. ఫీజు కట్టమని చెప్పి ఉంటే సమస్య తీరిపోయేది. అలా కాకుండా ఒకరి జీవితాన్ని నాశనం చేయడం ఎంతవరకు సరైనదని ప్రశ్నించారు.

నటుల సంఘం సెక్రటరీ రాధారవి వివరణ

ఈ ప్రశ్నకు  రాధారవి స్పందిస్తూ, “మీరు చెప్పింది నిజమే. కానీ వీటన్నిటికీ నేను సమాధానం చెప్పలేను. ఇది అనవసరమైన టాపిక్. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు” అని అన్నారు. 

ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో రాధారవి, “చెన్నైలో 70 సినిమాలకు డబ్బింగ్ చెప్పింది. చాలా పాటలు పాడింది. డబ్బింగ్ యూనియన్ కి ఆమె ద్వారా 10% కమిషన్ వస్తుంది. లక్షలు సంపాదిస్తున్న చిన్మయి 250 రూపాయలు కట్టలేదా?” అని ప్రశ్నించారు.

వైరముతుతో గొడవలే కారణమా?

ఈ వ్యాఖ్యలపై చిన్మయి స్పందిస్తూ, డబ్బింగ్ యూనియన్ లో శృతిహాసన్, విజయ్, కార్తీక్ లకు ఫీజు కడుతున్నారు. నాకే ఎందుకు కట్టలేదు?` అని ప్రశ్నించింది. రూ.250 రూపాయల కోసం చిన్మయికి డబ్బింగ్, పాటల నుండి బ్యాన్ చేయడం షాకింగ్ గా ఉంది.

 కానీ అసలు కారణం మీటూ ఉద్యమంలో వైరముతుతో గొడవలే అని అంటున్నారు. వైరముతుపై చిన్మయి అనేక కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి చిన్మయికి, వైరముతుకి పడటం లేదు. ఇదే ఆమెని తమిళంలో గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్ గా బ్యాన్‌ చేయడానికి కారణమని అంటున్నారు. ఏది నిజమో వారికే తెలియాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today డిసెంబర్ 06 ఎపిసోడ్ : రామరాజు గ్రీన్ సిగ్నల్.. వల్లికి ఉద్యోగం తిప్పలు, ఇరికించిన నర్మద, ప్రేమ
Superstar Krishna హీరోగా పూరీ జగన్నాథ్‌ ఫస్ట్ మూవీ ఎలా ఆగిపోయిందో తెలుసా? రెండు సార్లు చేదు అనుభవం