చేతిలో సినిమాల్లేవ్‌, కానీ కోట్లు సంపాదిస్తున్న అనుష్క శర్మ.. విరాట్‌ కోహ్లీ వైఫ్‌ ఆదాయం తెలిస్తే షాకే

Published : Jun 03, 2025, 09:59 PM IST
 Virat Kohli, Anushka Sharma

సారాంశం

క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఆదాయం ఎంతో తెలుసా? సినిమాలు లేకపోయినా ఆమె నెలకు ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా?

 బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1988లో పుట్టిన అనుష్క గత నెలలో 37వ పుట్టినరోజు జరుపుకుంది. ప్రస్తుతం భర్త విరాట్ కోహ్లీతో, కూతురుతో కలిసి హ్యాపీగా లైఫ్‌ని లీడ్‌ చేస్తుంది.  విరాట్ కోహ్లీతో కలిసి విరుష్కగా మారిన ఈ జంట 2017 డిసెంబర్ 11న పెళ్లి చేసుకున్నారు. 

సినిమాల్లో హీరోయిన్‌గా పీక్‌లో ఉండగానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది అనుష్క. కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీని ఆమె పెళ్లి చేసుకుంది. ఈ రొమాంటిక్ జంటకు 2021లో వామిక అనే కూతురు పుట్టింది. ఇప్పుడు అనుష్క శర్మ ఆదాయంపై నెటిజన్ల దృష్టి పడింది. ఆమె ఆదాయం ఎంత? ఆమె ఆస్తి ఎంత అని లెక్కలు వేసి బయటపెట్టారు.

అనుష్క శర్మ సొంత ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా?

 అనుష్క సినిమాల్లో ఉంటే, భర్త క్రికెటర్. ఇంకేం కావాలి? ఆదాయానికి కొదవలేదు. కానీ చాలా రోజులుగా అనుష్క సినిమాలు చేయడం లేదు. కానీ ఆమె కోట్లు సంపాదిస్తుంది. అది ఎలా సాధ్యమనేది చూస్తే,   

ఈ జంట యాడ్స్‌లో కోట్లు సంపాదిస్తున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చేసే పోస్ట్‌లకు కూడా డబ్బులు వస్తాయి.  అనుష్క ఒక్కో సినిమాకు 10-15 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుంది. అందుకే ఆమె అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా పేరు తెచ్చుకుంది.

ఇది కాకుండా, ఆమె ఓ వ్యాపారవేత్త కూడా. నష్ అనే సొంత బట్టల దుకాణం ఉంది. క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది. ఈ కంపెనీ ద్వారా `ఎన్‌హెచ్ 10`, `ఫిల్లౌరి`, `పరి` వంటి హిట్ సినిమాలు నిర్మించింది. చాలా పెద్ద బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ కూడా వ్యవహరిస్తుంది.

 అనుష్క సగటు నెలవారీ ఆదాయం కోటి రూపాయాలకుపైగానే ఉంటుందని అంచనా. దీనితో పాటు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా నెలకు 1 కోటి రూపాయలు సంపాదిస్తోంది. హీరోయిన్‌గా సినిమాలు లేకపోయినా నెలకు రెండు కోట్లకుపైగానే సంపాదిస్తుంది అనుష్క. కానీ చాలా మంది సెలబ్రిటీలు ప్రభుత్వానికి పన్ను కట్టకుండా మోసం చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. 

ఇన్‌ కమ్‌ ట్యాక్స్ వివాదంలో అనుష్క శర్మ

అలాంటి ఆరోపణ అనుష్కపై కూడా ఉంది. అది హైకోర్టు వరకు కూడా వెళ్ళింది. 2012 నుంచి 2016 వరకు బకాయి పన్ను కట్టాలని ఆదాయపు పన్ను శాఖ ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ అనుష్క శర్మ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను బాంబే హైకోర్టు 2023లో కొట్టివేసింది.

అనుష్క నిర్వహించే కార్యక్రమాలు, యాడ్స్, డ్యాన్స్ షోల నుంచి వచ్చే ఆదాయానికి ఆమె పన్ను కట్టాలని శాఖ తెలిపింది. ఈ విషయంలో 2021–22 సంవత్సరానికి బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. 

ఐటీ డిపార్ట్ మెంట్‌ లెక్కల ప్రకారం, 2012–13లో ఆమె ఆదాయం 12.3 కోట్ల రూపాయలుగా లెక్కించారు. కానీ ఆమె దానికీ టాక్స్ కట్టలేదు. ఈ మొత్తానికి వడ్డీతో కలిపి 1.2 కోట్ల రూపాయలు పన్ను చెల్లించాలి. 2013–14 సంవత్సరానికి 1.6 కోట్ల రూపాయలు పన్ను చెల్లించాలి.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today డిసెంబర్ 06 ఎపిసోడ్ : రామరాజు గ్రీన్ సిగ్నల్.. వల్లికి ఉద్యోగం తిప్పలు, ఇరికించిన నర్మద, ప్రేమ
Superstar Krishna హీరోగా పూరీ జగన్నాథ్‌ ఫస్ట్ మూవీ ఎలా ఆగిపోయిందో తెలుసా? రెండు సార్లు చేదు అనుభవం